Samantha at Subham Success Meet
ఎంటర్‌టైన్మెంట్

Samantha Subham: ట్రా లా లా లక్ష్యమిదే.. సమంత కోరిక తీరుతుందా?

Samantha Subham: ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌ని స్థాపించిన స్టార్ హీరోయిన్ సమంత.. మొదటి ప్రయత్నంగా ‘శుభం’ (Subham) అనే సినిమాతో రీసెంట్‌గానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నిర్మాతగా సమంత చేసిన మొదటి సినిమా ఇది. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మీ, షాలినీ కొండెపూడి, వంశీధర్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించగా, ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీ మే 9వ తేదీన విడుదలై, పాజిటివ్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతూ రెండో వారంలోకి అడుగు పెట్టేసింది. ఈ సందర్భంగా శుక్రవారం ‘శుభం’ చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సమంత తన బ్యానర్ లక్ష్యం ఇదేనంటూ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొదటి సినిమా సక్సెస్ సాధించడంతో, ఆమె అలా అని ఉండొచ్చు కానీ.. రాబోయే సినిమాలు ఆమె కోరికను తీర్చుతాయా? అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Pawan Kalyan: ‘ఓజీ’ షూట్ నుంచి సరాసరి ‘తిరంగా యాత్ర’కు.. ఆ టాట్టూ గమనించారా?

ఈ కార్యక్రమంలో నటి, నిర్మాత సమంత మాట్లాడుతూ.. పది శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చానా? అనేది నాకిప్పుడు అర్థమవుతోంది. ‘శుభం’ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరిలో నవ్వులు, సంతోషం చూశాను. ఇదే అసలైన సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఆనందం చూడటానికే నిర్మాతలు సక్సెస్‌తో సంబంధం లేకుండా ఇంకా ఇంకా సినిమాలు తీస్తూనే ఉంటారనేది నాకు అర్థమైంది. నాకు ఈ మూవీ చూస్తే నా సమ్మర్ హాలీడేస్ గుర్తుకొచ్చాయి. పిల్లల్ని సినిమాలకు తీసుకెళ్లేందుకు మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఓ మూవీని మా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసిన రోజులన్నీ నాకు మళ్లీ ఈ సినిమాతో గుర్తుకు వచ్చాయి. అవన్నీ నిన్నే జరిగినట్టుగా నాకు అనిపించాయి. ‘శుభం’ సినిమాతో అందరినీ మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లాం. మేం ఇలాంటి మంచి చిత్రాలను తీసి ఫ్యామిలీస్‌ను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. మీ తీపి జ్ఞాపకాల్ని మళ్లీ మళ్లీ మీకు గుర్తు చేస్తూనే ఉంటాం.. అదే మా ట్రా లా లా బ్యానర్ లక్ష్యం. దీనికి ఎంతైనా కష్టపడుతూనే ఉంటాం.

Also Read- Sree Vishnu: ‘సింగిల్’ శ్రీ విష్ణుకు బంపరాఫర్.. చెక్ కూడా ఇచ్చేశారట!

నటిగా ఉంటే లాస్ట్‌గా వచ్చి.. ఫస్ట్ వెళ్లిపోతాం. హీరోయిన్‌గా ఉన్నప్పుడు నేను కేవలం నా పాత్ర గురించే ఆలోచించేదాన్ని. కానీ నిర్మాతగా అసలు కష్టాలేంటో తెలుసుకున్నాను. సినిమా రిలీజ్‌కు ముందు మూడు రోజులు టీమ్‌లో ఏ ఒక్కరూ నిద్రపోలేదు. అంతలా కష్టపడ్డ నా టీమ్‌కు సక్సెస్ రావాలని, క్రెడిట్ దక్కాలని ఎంతగానో కోరుకున్నాను. ఇప్పుడు వస్తున్న ప్రేమ, అభిమానం, ప్రశంసలు అన్నింటికీ కారణం వాళ్లే. రాజ్ అండ్ హిమాంగ్‌లే ట్రా లా లా బ్యాక్ బోన్‌లా నిలుచున్నారు. ప్రవీణ్ చాలా మంచి వ్యక్తి. ఆయనెప్పుడూ ట్రా లా లాలో ఓ భాగమని ఈ సందర్భంగా చెబుతున్నాను. వసంత్, ధర్మేంద్ర, వివేక్ సాగర్, క్లింటన్, డైరెక్షన్ టీం, రామ్ ఆర్ట్ వర్క్, లేడీ కెమెరామెన్ మృదుల్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాకేష్‌.. ఇలా ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆర్య అయితే నా కెరీర్ నుంచి అండగానే నిలుస్తూ వస్తున్నారు. మీడియా కూడా ఎంతో సపోర్ట్ చేసింది. నాకు సపోర్ట్‌గా నిలిచిన మైత్రి శశి, సురేష్ బాబులకు థాంక్స్. అభిమానులే నా ప్రపంచం. ‘శుభం’ సినిమాను సక్సెస్ స్థాయికి తీసుకొచ్చిన, తీసుకెళుతున్న అభిమానులకు ధన్యవాదాలని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు