Ponnam Prabhakar( image credit: swetcha Reporter)
తెలంగాణ

Ponnam Prabhakar: విద్యాభివృద్ధి సామాజిక బాధ్యతగా కృషి చేయాలి.. మంత్రి పొన్నం

Ponnam Prabhakar: జిల్లాలో విద్యాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సామాజిక బాధ్యతగా కృషి చేయాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు.శుక్రవారం సిద్దిపేట జిల్లా ఐడిఓసి లోని సమావేశ మందిరంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అధ్యక్షతన దిశా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖలలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతి పై సమీక్షించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విద్యాభివృద్ధి అనేది ఒక సామాజిక బాధ్యత అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నాయని ప్రజలు ప్రజా ప్రతినిధులు అందరూ ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని జిల్లాల విద్యాభివృద్ధి కృషి చేయాలని అన్నారు.
ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలతో ప్రజలు అధికంగా లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినక్యాటిల్ షెడ్స్ ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు.

 Also Read: AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. పెద్ద తలకాయల అరెస్ట్

ఎంపీ లాడ్స్ నుండి మంజూరు చేయించిన 44 పనులు త్వరగా పూర్తిచేసి వివరాలు అందించాలని అన్నారు. అలాగే 16, 17 వ లోక్ సభల ఎంపీ నిధుల ద్వారా మంజూరై పూర్తికాని పనులు మరియు నిధుల వివరాలను అందించాలని అన్నారు. మల్లన్న సాగర్ ఎఫెక్టెడ్ విలేజ్ తుక్కాపూర్ లో ఓహెచ్ఎస్ఆర్ నిర్మించి త్రాగునీటి సమస్య రాకుండా చూడాలని అన్నారు.

పీఎం విశ్వకర్మ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి అందరికీ త్వరగా లోన్ సాంక్షన్ అయ్యేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎం. మనుచౌదరి. ఎంఎల్సీలు సి. అంజిరెడ్డి, మల్క కొమరయ్య, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమ అగ్రవాల్, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Ganja Seized: ముగ్గురు పెడ్లర్ల అరెస్ట్.. ​3.455 కిలోల గంజాయి సీజ్!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు