Nara Lokesh Flight
ఆంధ్రప్రదేశ్

Nara Lokesh: హెలికాప్టర్ లేకుంటే లోకేష్ అడుగు బయటపెట్టరా..?

Nara Lokesh: టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్ ఎప్పుడు చూసినా హెలికాప్టర్‌లోనే కనిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అడుగు తీసి అడుగు పెట్టాలంటే చాలు హెలికాప్టర్‌ కావాల్సిందేనని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబును మించి ఫ్లైట్‌ను ఎడాపెడా వాడేస్తున్నారనే విమర్శలు గట్టిగానే ఉన్నాయి. వాస్తవానికి ఇప్పటి వరకూ ఈ రేంజిలో తెలుగు రాష్ట్రాల్లో మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా తిరిగిందే లేదని.. హెలికాప్టర్‌ ఎక్కడంలో లోకేష్ రికార్డ్ సృష్టిస్తున్నారని సెటైర్లు వేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. ఎంత ముఖ్యమంత్రి కుమారుడు అయితే మాత్రం సీఎంలాగా ప్రవర్తిస్తారా?, ఇంతకీ ఆయన మంత్రా లేకుంటే ముఖ్యమంత్రా? అంటూ సోషల్ మీడియా చిత్రవిచిత్రాలు కామెంట్లు వస్తున్నాయి.

Lokesh and Chandrababu

Read Also- Bandla Ganesh: సీఎం చంద్రబాబుతో బండ్ల గణేష్ భేటీ.. పవన్‌ను కలవలేదేం?

రేంజి మారిపోయిందబ్బా?వాస్తవానికి చంద్రబాబును (CM Chandrababu) చినబాబు (లోకేష్) మించిపోయారనే మాట చాలా రోజులుగా వినిపిస్తున్నదే. పాలనా పరంగా, మంత్రుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే.. మరీ ముఖ్యంగా సఖల శాఖా మంత్రిగా వ్యవహారిస్తున్నారనే విమర్శలు టీడీపీలోనే వినిపిస్తున్నాయి. ఇక వైసీపీ నుంచి అయితే ఆ కామెంట్లు మాటల్లో చెప్పలేం, రాతల్లో రాయలేం అన్నట్లుగా ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా హెలికాప్టర్ మంత్రి అంటూ సంబోదిస్తున్న పరిస్థితి. అదేదో గేదేలంటే మాకు ప్రాణం అనే డైలాగ్ ఉంది కదా? అచ్చు గుద్దినట్లుగా.. లోకేష్‌కు హెలికాప్టర్లు అంటే విపరీతంగా మోజు ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ‘హెలికాప్టర్ అంటే నాకు ప్రాణం.. రోజూ హెలికాప్టర్‌లోనే తిరుగుతా.. హెలికాప్టర్‌లోనే నిద్రపోతా’ అన్నట్లుగా చినబాబు తీరు ఉందని నెటిజన్లు, విమర్శకులు దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి. ఎందుకంటే గత కొన్నిరోజులుగా లోకేష్ పర్యటనలు చూస్తే ఎక్కడా హెలికాప్టర్‌లో తప్ప కారులో కనిపించిన దాఖలాల్లేవ్. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలన్నా, విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలన్నా.. విజయవాడ నుంచి ఇంకెక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్ ఎక్కాల్సిందే.. లేకుంటే అడుగు బయటపెట్టే పరిస్థితి ఏమాత్రం కనిపించట్లేదు.

Lokesh In Helicopter

ముగ్గురూ ముగ్గురే..!
హెలికాప్టర్ ఎక్కడంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేష్‌లలో ఎవరేం తక్కువ కాదు. సీఎం చంద్రబాబు వారంలో ఒకట్రెండు సార్లు హైదరాబాద్, ఇక ఏ జిల్లాకు వెళ్లాలన్నా హెలికాప్టర్ కావాల్సిందే. పవన్ అంటారా.. ప్రభుత్వ కార్యక్రమాలు మొదలుకుని సినిమా షూటింగ్‌లకు వెళ్లాలన్నా కచ్చితంగా ఫ్లైట్ ఎక్కాల్సిందేననే విమర్శలూ లేకపోలేదు. ఇక లోకేష్ అయితే అటు సీఎం, ఇటు డిప్యూటీ సీఎంను మించిపోయారనే విమర్శలు గట్టిగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా వారాంతం (వీకెండ్‌)లో ముగ్గురూ విజయవాడ నుంచి హైదరాబాద్.. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుంటారు, వస్తుంటారు. ముగ్గురూ వెళ్లేది హైదరాబాద్, అందులోనూ ఒకే రూట్ అయినప్పటికీ ముగ్గురికీ మూడు హెలికాప్టర్లు కావాల్సిందే. ముగ్గురూ ఒక్కే హెలికాప్టర్‌లో పోయిందే లేదు. బహుశా ఇదంతా.. అదేనండోయ్ ‘సంపద సృష్టిస్తా.. పేదలకు పంచుతా’ అని ఎన్నికల ముందు.. ‘సంపద సృష్టి ఎలాగో చెవిలో చెప్పండి’ అని ఫలితాల తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా. బహుశా ఇలా హెలికాప్టర్లలో తిరగడం కూడా సంపద సృష్టిలో భాగమేనేమో..! అని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. పోనీ ఈ తిరగడాలకు సొంత డబ్బులు ఏమైనా ఖర్చు చేస్తున్నారా? అబ్బే  పైసా కూడా ఖర్చు చేయరు. బహుశా వీళ్లు హెలికాప్టర్లు వాడే వాడకానికి.. ఒకట్రెండు సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చేమో? అని కామెంట్స్ వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Chandrababu And Pawan , Lokesh

కొత్త హెలికాప్టర్ కొంటే..!
ఇప్పటి వరకూ ప్రైవేట్ హెలికాప్టర్లలో తిరుగుతున్న నారా లోకేష్.. త్వరలోనే సీఎం చంద్రబాబు రూ.172 కోట్లతో హెలికాప్టర్ కొంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇక చినబాబును అస్సలు పట్టుకుంటామా? అబ్బో అస్సలు ఆ సాహసం కూడా ఎవరూ చేయలేరేమో. ఇప్పుడు ఎంతలా తిరుగుతున్నారో అప్పుడిక డబుల్, ట్రిబుల్ అంతకుమించి రెట్టింపు తిరిగినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకుంటా. కాగా, ఇప్పటికే రూ.172 కోట్ల ప్రజాధనంతో చంద్రబాబు, లోకేష్ విలాసవంతమైన హెలికాఫ్టర్ కొంటున్నట్లుగా వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నది. రెండ్రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో ఇదో పెద్ద చర్చ, అంతకుమించి రచ్చగానే నడుస్తోంది. దీనిపైన టీడీపీ, ఏపీ ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఖండించింది కానీ.. ఇందుకు సంబంధించి జీవోలతో సహా బయటపెట్టడం గమనార్హం. చూశారుగా.. లోకేష్ గురించి ఏ రేంజిలో ప్రచారం జరుగుతోందో.. ఇప్పటికైనా కాస్త హెలికాప్టర్ ఎక్కడం కాస్త తగ్గించి.. పరిపాలన, శాఖలపై దృష్టి పెడితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

Nara Lokesh

Read Also- Janasena: పుంజుకుంటున్న బీజేపీ.. మంత్రి పదవికే అంకితమైన పవన్.. జనసేనకు ఎందుకీ గతి?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు