Maheshwar Reddy on Congress: రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది. రాష్ట్రం దివాళాపై ఉప ముఖ్యమంత్రి భట్టి ఎందుకు స్పందించడం లేదు భట్టికి, రేవంత్‌కు మద్య ఏమైనా విభేదాలు ఉన్నాయా అని బీజేపి అభ్యర్థి యేలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్థిక దివాలపై కేబినెట్ మంత్రులు కూడా స్పందించడం లేదని, రేవంత్ పాలనలో మంత్రులలో విభేదాలు ఉన్నది వాస్తవమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి ఏ ఒక్క మంత్రి సహకరించడం లేదు. తెలంగాణలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే దిశగా రేవంత్ కుట్ర చేస్తున్నారు. రేవంత్ కుట్రలను మంత్రులందరూ విభేదిస్తున్నారని, మంత్రి మండలి రెండుగా చీలిపోయిందని అన్నారు. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలను మంత్రులు ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేరవేస్తున్నారని, రేవంత్ పాలన ఆ పార్టీలో ఏ ఒక్కరికి నచ్చడం లేదని అన్నారు. అధిష్టానానికి, ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ పెరుగుతోంది. రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చిన, రేవంత్‌ను కలవకుండా వెళ్ళడం అందుకు నిదర్శనంగా నిలుస్తుందని తులిపారు.
రామకృష్ణ రావు అందుకే వచ్చిండు
ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు ఎగ్గొట్టేందుకే ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని రేవంత్ పావులు కదురుపుతున్నారని, రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారమే చీఫ్ సెక్రటరీగా రామకృష్ణ రావు నియామకం జరిగిందని అన్నారు. రామకృష్ణ రావు ఇచ్చే ఇన్ పుట్స్ ద్వారానే ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించేందుకు సీఎం సన్నద్ధం అవుతున్నారని, ఆర్థిక ఎమర్జెన్సీను ప్రకటించేందుకే రామకృష్ణ రావును సిఎస్ గా నియమించారని అన్నారు. మంత్రులలో రేవంత్ రెడ్డి నమ్మకం కోల్పోతున్నారు. అన్ని శాఖలలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటుండటంతో మంత్రులలో అసహనం పెరుగుతోందని. భట్టి, ఉత్తమ్, రేవంత్‌ల మధ్యలో సఖ్యత చెడిందని అన్నారు. మంత్రివర్గ విస్తరణ అడ్డుకుంటున్నది ముఖ్యమంత్రే రంగారెడ్డికి మంత్రి పదవి రాదని జాన రెడ్డితో సీఎం లెటర్ రాయిస్తారు నేతల మధ్య విభేదాలు వచ్చేలా సీఎం వ్యవహరిస్తారు. మంత్రి పదవుల కోసం తానే స్వయంగా లెటర్లు తీసుకుంటారని, సీఎం ఎత్తుగడలన్నీ రేవంత్ రెడ్డి ఎత్తుగడలే అని మంత్రివర్గ విస్తరణ రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని, తనకు అనుకూలమైన వారికి మాత్రమే మంత్రి పదవి రావని సీఎంకు తెలుసు కాబట్టి కొత్త వారికి మంత్రి పదవులు వస్తే సీఎం కింద ఉన్న శాఖలు పోతాయని రేవంత్ రెడ్డి జగన్నాటకం ఆడుతున్నారని అన్నారు.
Also Read: Telangana Jagruti: యువతకు కవిత పిలుపు.. జూన్ 2న పోటీలు.. మ్యాటర్ ఏంటంటే!
సీఎం చిట్ట రాహుల్ గాంధీ దగ్గర
మంత్రి వర్గ విస్తరణ జరిగితే నలుగురు బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుందనే సీఎం మంత్రివర్గ విస్తరణ అడ్డుకుంటున్నారని అన్నారు. బీసీలకు పెద్ద పీట వేయడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. మంత్రివర్గ విస్తరణలో సీఎం జగన్నాటకం ఆడుతున్నారు. ఆ జగన్నాటకం మంత్రులు, ఎమ్మెల్యేలు పావులుగా మిగిలిపోతున్నారని, కీలక శాఖలు సీఎం దగ్గర పెట్టుకొని, పనికి మాలిన రెండు మంత్రి పదవులిచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. సీఎం చిట్ట రాహుల్ గాంధీ దగ్గర ఉంది. అధిష్టానం అవకాశం కోసం ఎదురుచూస్తోంది లోకల్ బాడీ తరువాత కాంగ్రెస్ అధిష్టానం ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై అసహనంలో ఉన్నారని, లోకల్ బాడీ ఎన్నికల తర్వాత రేవంత్ సర్కార్ సీన్ సీతారా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు.
Aalso Read: MP Bandi Sanjay: సీఎంకు బండి లేఖ.. ఫీజు బకాయిలపై ప్రశ్నలు.. ఆపై వార్నింగ్!