CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు. సరస్వతి పుష్కరాలు సందర్భంగా పుష్కర ఘాట్ లో ఏర్పాటు చేసిన శ్రీ సరస్వతీ దేవి ఏకశిలా విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం సీఎం రేవంత్.. మంత్రులతో కలిసి కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు.
కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించి, నదీ పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/mtNu4O0Kxa
— BIG TV Breaking News (@bigtvtelugu) May 15, 2025