Heavy Rains TG(image credit:X)
తెలంగాణ

Heavy Rains TG: తెలంగాణాలో వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

Heavy Rains TG: మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలంగాణాలో మెల్లగా వాతావరణం చల్లబడుతోంది. ఇన్నిరోజులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉక్కపోతతో అల్లాడిన జనం.. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులు వీస్తుండటంతో ఉపశమనం పొందుతున్నారు.

రానున్న నాలుగు నుంచి అయిదు రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉండనుందని వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణాలో భారీ వర్షాలు పడే సూచన ఉండటంతో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Also read: Boycott Countries: భారతీయుల బాయ్ కాట్ అస్త్రం.. టర్కీ తరహాలో చావుదెబ్బ తిన్న దేశాలు ఇవే!

ఇక నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్
నిన్నటి వరకు నిప్పులుకక్కే ఎండలతో అల్లాడిన హైదరాబాద్.. ఒక్కసారిగా వాతావరణం మార్పుతో చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామునే వర్షం పడటంతో నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రానున్న నాలుగు రోజులల్లో ఈదురు గాలులతో పాటు వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు పోలీసులు కూడా అప్రమత్తం చేశారు.

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!