Notice to Hospitals: తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్ ఇచ్చింది. దాదాపు 20 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు, మెజార్టీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఎన్ ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్ కు ఎన్ ఎంసీ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది.
ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తవి కలిపి జిల్లాకు ఒకటి చొప్పున ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొనసాగుతుండగా, 28 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఏకంగా 90 శాతం కాలేజీలకు నోటీసులు జారీ కావడం గమనార్హం. దీంతో వైద్యాధికారులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు షాక్ కు గురయ్యాయి.
అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ల వివరాలు, మెయింటనెన్స్ సరిగ్గా లేవంటూ ఎన్ ఎంసీ మెయిల్ లో మెన్షన్ చేసింది. ఇక ఎంఆర్ ఐ, సిటీ స్కాన్లు పనితీరుతో పాటు ఇతర డయాగ్నస్టిక్ సేవలు వెరీ పూర్ ఉన్నట్లు పేర్కొన్నది. సర్జరీల్లో జాప్యం, సక్సెస్ రేట్ లేకపోవడం వంటి సమస్యలను ఎన్ ఎంసీ ఆయా షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నది.
Also read: BRS Party: అసలు మ్యాటర్ ఏంటి? గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది?
ఇక ప్రొఫెసర్ల కొరత, నాన్ టీచింగ్ స్టాఫ్, అబాస్ అడెండెన్స్ వైఫల్యం తదితర సమస్యలన్నింటినీ వివరిస్తూ షోకాజ్ నోటీసులో పొందుపరిచింది. వీటిపై కేవలం వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఎన్ ఎంసీ నొక్కి చెప్పింది.
ఇలా దొరికారు..?
నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు ప్రకారం ప్రతి ఏటా ఒక్కో మెడికల్ కాలేజీ తమ పూర్తి స్థాయి డేటాను ఏడీఆర్ రిపోర్టు పేరిట ఎన్ ఎంసీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అంతకంటే ముందే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన హెచ్ ఎంఐఎస్ పోర్టల్ లోనూ ఆయా కాలేజీల వివరాలు సమర్పించాలి.
ఏడీఆర్ రిపోర్టు, హెచ్ ఎంఐఎస్ పోర్టల్ వివరాలు తప్పనిసరిగా ట్యాలీ అవ్వాలి. కానీ ఈ సారి ఓపీ నుంచి ఆపరేషన్ థియేటర్ వరకు వివరాలేవీ సరిగ్గా లేవని ఎన్ ఎంసీ గుర్తించింది. దీంతో షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఇక వారం రోజుల్లో మెడికల్ కాలేజీలు ఇచ్చే వివరణ సంతృప్తి కరంగా లేకుంటే భారీగా పెనాల్టీలు కట్టాల్సిన ప్రమాదం ఉన్నది. గతంలోనూ కొన్ని ప్రభుత్వ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు పెనాల్టీలు కట్టిన సందర్భాలు ఉన్నాయి.
Also read: Vemulawada: రాజన్న ఆలయం చుట్టూ రచ్చ.. ఎందుకిలా?
అయితే గతంలో ఒకటి రెండు కాలేజీలు కట్టగా, ఈ సారి మాత్రం భారీగా షోకాజ్ నోటీసులు అందాయి. మరోవైపు ఆరోగ్యరంగంలో తమిళనాడు దేశంలోనే టాప్ లో ఉంటుందని ప్రచారం ఉన్నది. అన్ని సంస్థలు, రీసెర్చ్ లు కూడా ఇదే సూచిస్తున్నాయి.
కానీ తమిళనాడులో 36ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఏకంగా 34 కాలేజీలకు ఎన్ ఎంసీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యకరం. తమిళనాడు కాలేజీలకే నోటీసులు వచ్చాయంటే మన దగ్గర ఉన్న మెడికల్ కాలేజీల పరిస్థితిని ఊహించుకోవచ్చని ఓ ఉన్నతాధికారి అసంతృప్తిని వ్యక్తం చేశారు.