Web Series: కన్నడ, హిందీ, తమిళ భాషలలో విడుదలై అద్భుతమైన ఆదరణను రాబట్టుకోవడమే కాకుండా, సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. జీ5 కన్నడ ఒరిజినల్ సిరీస్‌గా విడుదలైన ఈ వెబ్ సిరీస్, విడుదలైన మొదటి రోజు నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. తెలుగులోనూ ఈ వెబ్ సిరీస్ కావాలని జీ5 వీక్షకులు కోరడంతో, ఈ వెబ్ సిరీస్‌ను తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు రెడీ చేసి, డేట్‌ని కూడా ప్రకటించారు. ఇంతకీ ఏమా వెబ్ సిరీస్? అందులో ఏముందని అంతగా ఓటీటీ వీక్షకులు కోరుకుంటున్నారనే విషయంలోకి వస్తే..
Also Read- Vijay Antony: విజయ్ ఆంటోని మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్
ఐఎమ్‌డిబి రేటింగ్స్‌లో 8.6 రేటింగ్ పొందిన జీ5 కన్నడ ఒరిజినల్ సిరీస్ ‘అయ్యనా మానే’ (Ayana Mane). ఖుషీ రవి, అక్షయ నాయక్, మానసి సుధీర్ ప్రధాన పాత్రలుగా రమేష్ ఇందిర దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. కన్నడ, హిందీ, తమిళ భాషలలో ఇప్పటికే భారీ విజయం సాధించిన ఈ గ్రిప్పింగ్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఇప్పుడు మే 16 నుంచి తెలుగులో విడుదల కానుంది. దీంతో దక్షిణ భారతదేశం అంతటా ‘అయ్యనా మానే’ పరిధిని మరింత విస్తృతం చేయనున్నామని జీ5 ప్రకటించింది. వాస్తవానికి ఇందులో ఉన్న కంటెంట్, చూసే అందరినీ అలా కూర్చుండిపోయేలా చేస్తుంది. ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఇస్తూ.. ప్రతి ఇంటిలో జరిగే సంఘటనలతో దర్శకుడు ఈ వెబ్ సిరీస్‌ను మలిచారు. అందుకే ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ విడుదలైన కొన్ని రోజుల్లోనే రికార్డ్ వ్యూస్ రాబట్టుకుంది.
‘అయ్యనా మానే’ కథ విషయానికి వస్తే.. చిక్ మంగళూర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ముగ్గురు కోడళ్ల రహస్య మరణాల చుట్టూ ఈ కథనం తిరుగుతుంది. ప్రతి మరణం కల దేవత కొండయ్యకు సంబంధించిన శాపం వల్లే జరుగుతుందని అంతా నమ్ముతుంటారు. జాజీ (ఖుషీ రవి) కుటుంబంలోకి ప్రవేశించినప్పుడు తన ప్రాణాలను బలిగొంటుందని ఇట్టే గ్రహిస్తుంది. నమ్మకమైన పని మనిషి తాయవ్వ, సిన్సియర్ ఆఫీసర్ మహానేష్ మద్దతుతో ఇంటి రహస్యాలను ఒక్కోక్కటిగా బయటకు తీసుకు వస్తూ ఉంటుంది. సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ అంశాలతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ చూస్తున్న అందరినీ వెంటనే కథలోకి తీసుకెళుతుంది.
Also Read- Virgin Boys Teaser: కపుల్ కిస్ సీన్.. ఈ టీజర్‌కే హైలెట్!
ఇందులో తను చేసిన పాత్ర గురించి ఖుషీ రవి మాట్లాడుతూ.. ‘అయ్యనా మానే’ వెబ్ సిరీస్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది. నా పాత్ర సవాలుతో కూడుకుని ఉంటుంది. ఇలాంటి కన్నడ కథలకు ప్రాముఖ్యతను కల్పించిన జీ5, శృతి నాయుడు ప్రొడక్షన్స్‌కి కృతజ్ఞతలు. ప్రేక్షకులు మా వెబ్ సిరీస్ మీద, అలాగే నా పాత్ర మీద కురిపిస్తున్న ప్రేమను చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. ఇది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. సౌత్ అంతటా కూడా మా సిరీస్ సత్తాను చాటుకుంటుందని నమ్ముతున్నానని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు