Vijay Antony: విజయ్ ఆంటోని.. తమిళ, తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. తన మల్టీటాలెంట్‌తో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో విజయ్ ఆంటోని రూటే వేరు. రొటీన్ చిత్రాలకు విభిన్నంగా ఆయన చేసే చిత్రాలుంటాయి. ఇప్పుడాయన నటిస్తున్న మరో విభిన్న కథా చిత్రం ‘మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, మీరా విజయ్ ఆంటోని (Meera Vijay Antony) సమర్పిస్తున్నారు. మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన విజయ్ ఆంటోనీ ఫస్ట్‌లుక్ పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే.. (Maargan Movie Release Date)
Also Read- Preity Zinta: ఆ క్రికెటర్ ను పెళ్లి చేసుకో అన్న ప్రశ్నకి.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రీతి జింతా
ఇప్పటికే మేజర్ పార్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్ 27న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఈ సినిమాకు ఉన్న మరో విశేషం ఏమిటంటే.. విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్ (Ajay Dhishan)ను ఈ సినిమాతో విలన్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. తాజాగా వదిలిన యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్‌ను చూస్తుంటే విజయ్ ఆంటోనీ, అజయ్ (Ajay) మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయనేది తెలుస్తోంది. ఈ రెండు పాత్రలు తలపడే సీన్లు ప్రేక్షకులకు ఆడ్రినలిన్ రష్ ఇచ్చేలా ఉంటాయని మేకర్స్ కూడా చెబుతున్నారు. ఇందులో సముద్రఖని, మహానటి శంకర్, ప్రీతిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ వంటి వారంతా కీలక పాత్రలలో కనిపించనున్నారు.
#MAARGAN – Releasing in theatres June 27 ❌@leojohnpaultw @AJDhishan990 @vijayantonyfilm @mrsvijayantony pic.twitter.com/FJ1EwZpY2m
— vijayantony (@vijayantony) May 14, 2025
Also Read- Aamir Khan Film: చిక్కుల్లో అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ చిత్రం.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా, హృద్యమైన కుటుంబ కథా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి యువ.ఎస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తుండగా, విజయ్ ఆంటోని స్వయంగా తనే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే చిత్ర టీజర్, ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం విజయ్ ఆంటోనికి కూడా చాలా కీలకం. ఎందుకంటే, కొన్నాళ్లుగా ఆయన నుంచి వస్తున్న సినిమాలేవీ పెద్దగా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. ‘బిచ్చగాడు’ (Bichagadu) తరహా హిట్ చూసి విజయ ఆంటోని చాలా కాలమే అవుతుంది. అందుకే ఈ సినిమా కోసం ఆయన భారీగా ఎఫర్ట్ పెడుతున్నారని తెలుస్తుంది. మరి ఆయన పెడుతున్న ఎఫర్ట్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో తెలియాలంటే మాత్రం జూన్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు