RTI Commission (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

New RTI Commissioners: సమాచార హక్కు కమిషనర్ల ప్రమాణ స్వీకారం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

New RTI Commissioners: పలు రంగాలకు చెందిన నలుగురిని రాష్ట్ర సమాచార హక్కు కమీషనర్లుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) నియమంచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో వారి ప్రమాణ స్వీకారం జరిగింది. సీనియర్ జర్నలిస్టులు పీవీ శ్రీనివాస్ (P.V. Srinivas), అయోధ్య రెడ్డి (Ayodhya Reddy), న్యాయవాదులు దేశాల భూపాల్, మోహిసినా పర్వీన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎస్ కె. రామకృష్ణారావు హాజరయ్యారు.

నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్టీఐ కమిషనర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా కొత్త ప్రమాణం స్వీకారం చేసిన కమిషనర్లు మూడేళ్ల పాటు లేదా వయసు 65 ఏళ్లు నిండే వరకూ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా కొనసాగుతారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ఆర్టీఐ కమిషన్ ఖాళీగా ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో కొత్త కమిషనర్ల నియాకం జరిగింది. కాగా ఆర్టీఐ ప్రధాన కమిషనర్ గా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని గత వారమే ప్రభుత్వం నియమించడం గమనార్హం.

Also Read: NVSS Prabhakar: బిగ్ బ్లాస్టింగ్.. సీఎం మార్పు ఖాయం.. రేవంత్ స్థానంలో సీనియర్ లీడర్!

అయితే తొలుత ఆర్టీఐ కమిషనర్లుగా ఏడుగురిని నియమించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇందుకు అనుగుణంగా ఏడుగురు పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే వారిలోని కొంతమందిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ముగ్గురిని గవర్నర్ తిరస్కరించగా.. ఒకరి స్థానంలో మరొకరికి అవకాశం కల్పించారు. న్యాయశాస్త్రం, టెక్నాలజీ, సామాజిక సేవ, జర్నలిజం, మేనేజ్ మెంట్ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఆర్టీఐ కమిషనర్లుగా నియమిస్తుంటారు.

Also Read This: Arunachal Pradesh: చైనా ఓవరాక్షన్.. గట్టిగా బుద్ధి చెప్పిన భారత్.. డ్రాగన్‌తోనూ తగ్గేదేలే!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!