Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని పలు పనుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.8కోట్లు మంజూరు చేసింది. మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో ఈ నెల15 నుంచి 26 వరకు సరస్వతి నది పుష్కరాలు జరుగనున్నాయి. పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఏర్పాట్లు, తాత్కాలిక పనుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇప్పటికే పుష్కరాలకు కోసం రూ.25 కోట్లు కేటాయించగా.. ఇందులో రూ.21.56 కోట్లతో 65 పనులను సంబంధిత ఏజెన్సీలకు అప్పగించింది.
అదనంగా వీఐపీ ఘాట్ విస్తరణ, ఇతర పనులకు రూ.3.75 కోట్లు మంజూరు చేయాల్సి ఉంది. తాజాగా కేటాయించిన నిధులతో గోదావరి హారతి, పోలీసు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది కోసం ఆహార ఖర్చులు, రోడ్డు, అటవీ, రవాణా, దేవాదాయ శాఖల పనులు, యాప్ డెవలప్‌మెంట్, ఐటీ సాధనాలు, వీఐపీ ఘాట్లు, శాశ్వత లైటింగ్ పనులకు కేటాయించనున్నారు. పుష్కరాల ప్రచారానికి ప్రభుత్వం 20లక్షలు మంజూరు చేసింది.
Also Read: Mahabubabad district: రైతులకు 21 వేల కోట్లతో రుణమాఫీ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు!
ఈ నెల 15 నుంచి 26వ తేదీవరకు రాష్ట్రంలో కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు కొనసాగనున్నాయి. అందుకు భక్తులు భారీగా తరలి రానుండటంతో అందుకు తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపనుంది. అందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఉత్తర తెలంగాణలోని ప్రతి ఆర్టీసీ డిపో నుంచి 5 బస్సులు నడపనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ ప్రయాణికుల సౌలభ్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.
అత్యధికంగా హనుమకొండ డిపో నుంచి 65 బస్సులను నడుపుతామని అందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు నడిపేందుకు సన్నద్ధమయ్యారు. అదే విధంగా జనగాం డిపో నుంచి 10 బస్సులు, కరీంనగర్ నుంచి 30, పరకాల నుంచి 10, భూపాల పల్లినుంచి 25, గోదావరి ఖని నుంచి 30, మంథని నుంచి 10, మంచిర్యాల నుంచి 20 బస్సు సర్వీసులు పుష్కరాలను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ నెల 15 నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు