Star Heroin (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Star Heroine: రణ్ వీర్‌ను రిజెక్ట్ చేశా.. నా స్థానంలోకి దీపికా.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Star Heroine: చిత్ర పరిశ్రమలో నటీనటులు తీసుకునే కొన్ని నిర్ణయాలు సెలబ్రిటీల జీవితాలను రాత్రికి రాత్రే మార్చేస్తుంటాయి. డైరెక్టర్ చెప్పిన కథలను రిజెక్ట్ చేయడం వల్ల కొందరికి మంచి జరిగితే మరికొందరికీ కెరీర్ పరంగా పెద్ద దెబ్బగా మారిపోవచ్చు. రిజెక్ట్ చేసిన స్టోరీలు బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచి వారికి ప్రశాంతతను దూరం చేయవచ్చు. ఇప్పుడే అదే బాధలో ఉన్నారు ప్రముఖ నటి భూమిక చావ్లా. ఈ అమ్మడు రిజెక్ట్ చేసిన మూవీ వల్లే రణ్ వీర్ సింగ్ – దీపికా పదుకొనే భార్య భర్తలుగా మారారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోయిన్లలో భూమిక చావ్లా ఒకరు. ఒక్కడు, ఖుషి, సింహాద్రి వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి ఓ దశలో టాలీవుల్ అగ్ర హీరోయిన్ గా గుర్తింపు సంపాదించారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లోనూ ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. అయితే అప్పట్లో తను చేసిన తప్పు గురించి భూమిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. హిందీలో మంచి విజయం సాధించిన ‘బాజీరావు మస్తానీ’ సినిమాలో తొలుత తానే చేయాల్సి ఉందని భూమిక తెలిపారు. అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయినట్లు ఆమె చెప్పారు. అది చేసి ఉంటే తన జీవితంలో ఇంకోలా ఉండేదని ఆమె బాధపడినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

Also Read: PM Modi Adampur Visit: పాక్‌ను నిద్రపోనిలేదు.. మన సత్తా ఎంటో చూపాం.. ప్రధాని మోదీ

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన బాజీరావ్ మస్తానీ చిత్రం.. 2015లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలోనే రణ్ వీర్ సింగ్ – దీపికా ఒకరికొకరు దగ్గరయ్యారు. ఆపై పీకల్లోతూ ప్రేమలో పడ్డారు. బాజీరావు మస్తానీ వారి కెరీర్ కు మంచి బూస్టప్ ఇవ్వడంతో పాటు.. కొత్త జీవితాలను అందించింది. ఈ నేపథ్యంలో భూమిక గనుక బాజీరావు సినిమా చేసి ఉంటే ఆమె లైఫ్ కూడా మరోలా ఉండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read This: Pakistan War Statement: భారత్‌తో యుద్ధం.. తొలిసారి పెదవి విప్పిన పాక్.. ప్రాణ నష్టంపై కీలక ప్రకటన

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!