Case Filed on Aghori: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనంగా మారిన అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పూజల పేరుతో ఓ మహిళను మోసం చేసిన కేసుకు సంబంధించి ప్రస్తుతం అఘోరీ పోలీసుల రిమాండ్ లో ఉన్నాడు. ఈ కేసు విచారణ జరుగుతున్న క్రమంలోనే అఘోరీకి మరో షాక్ తగిలింది. ఈసారి అఘోరీపై అత్యాచారం కేసు నమోదు కావడం తీవ్ర చర్చకు తావిస్తోంది.
అఘోరీ చేసిన మోసాలు, రాసలీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆర్థిక మోసానికి సంబంధించి ప్రస్తుతం పోలీసుల రిమాండ్ లో ఉన్న అఘోరీపై తాజాగా మరో కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఈ కేసును నమోదు చేశారు. సనాతనం ధర్మం పేరుతో ఫోన్లో పరిచయం పెంచుకొని తనను లొంగుదీసుకున్నాడని అఘోరీపై బాధితురాలు ఫిర్యాదు చేసింది.
అఘోరీ అలియాస్ శ్రీనివాస్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కొత్తపల్లి కెనాల్ వద్దకు తీసుకెళ్లి తన ప్రైవేటు భాగాలపై చేతులు వేశాడని ఆరోపించింది. బలవంతంగా కొండగట్టు తీసుకెళ్లి మెడలో తాళి కూడా కట్టారని పోలీసులకు తెలిపింది. ఆపై తనపై అత్యాచార యత్నం చేయబోయాడని ఆరోపించింది.
Also Read: CBSE 12th Results 2025: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫలితాలు విడుదల.. మార్క్స్ ఇలా పొందండి!
అంతటితో ఆగకుండా తనను బెదిరించి రూ.3 లక్షల రూపాయలు అఘోరీ తీసుకున్నాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. రాసలీలల విషయాన్ని బయటపెడితే చంపేస్తానంటూ బెదిరించాడని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అఘోరీపై 64(1), 87 318(4) 351(2) సెక్షన్ల కింద కేసు పోలీసులు కేసు పెట్టారు. ఇప్పటికే పోలీసుల రిమాండ్ లో అఘోరీని ఈ కేసుకు సంబంధించి విచారించే అవకాశముంది.
హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఇటీవల అఘోరీపై మోకిలా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పూజల పేరుతో తన వద్ద రూ.9.5 లక్షలు తీసుకొని మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన మోకీలా పోలీసులు.. అఘోరీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. మరోవైపు అఘోరీకి మెుదటి భార్య తానేనంటూ ఓ యువతి ఇటీవల మీడియా ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే శ్రీవర్షిణి అనే యువతిని సైతం అఘోరీ పెళ్లి చేసుకున్నాడు. తాజా కేసు నేపథ్యంలో అఘోరీ వ్యవహారం మరోమారు చర్చకు వచ్చింది.