Congress vs Etela Rajender: రాష్ట్రంలో వేసవి హీట్‌కు తోడు పొలిటికల్ హీట్ సైతం పెరిగింది. కాంగ్రెస్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా పరిస్థితి ఇప్పుడు మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మల్కాజిగిరి ఎంపీ చేసిన వ్యాఖ్యలే దీనికి దారితీశాయి. ఈటల.. సీఎంను సైకో, శాడిస్ట్ అంటూ ఇటీవల కామెంట్స్ చేయడంపై హస్తం పార్టీ ఘాటుగా స్పందించింది. ముఖ్యమంత్రిపై అలాంటి విమర్శలు తగునా అంటూ నేతలు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. బీజేపీ సైతం కాస్త ఘాటుగానే తిప్పికొట్టింది. కానీ, కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీ కాస్త వెనుకబడింది. గతంలో బీజేపీలో ఈ మాత్రం కౌంటర్లు ఇచ్చే పరిస్థితి కూడా లేని స్థితి నుంచి కాస్తో కూస్తో హస్తం పార్టీకి కౌంటర్లు ఇచ్చే స్థాయికి చేరుకోవడం గమనార్హం.
నేతల్లో మార్పు.. విషయమేంటి?
తెలంగాణ బీజేపీలో నేతల తీరు ఎవరికి వారు యమునా తీరే అనే రీతిలో ఉండేది. గతంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా పట్టించుకున్న నాథుడే లేదు. వారికి వారే సొంతంగా వచ్చి కౌంటర్ ఇచ్చుకునే పరిస్థితి ఉండేది. ఈటలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడడంతో పలువురు నేతలు కౌంటర్లు ఇచ్చే స్థితికి పార్టీ చేరుకుంది. అయితే, ఇదంతా ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నందుకే చేశారా? లేక పార్టీ నేతపై విమర్శలు చేస్తే సహించేది లేదన్న కోణంలోనే చేశారా? అన్నది సస్పెన్స్‌గా మారింది. ఈటల ప్రెసిడెంట్ అయితే తమకు అండగా ఉంటారన్న నేపథ్యంలోనే వీరు స్పందించారా అనే చర్చ సైతం పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది.
Also Read: Beerla Ilaiah On Kavitha: బీఆర్ఎస్ పాపాల పై మాట్లాడినందుకు కవితకు ధన్యవాదాలు.. బీర్ల అయిలయ్య!
గతం కంటే కాస్త బెటర్
టీ బీజేపీ స్టేట్ చీఫ్‌గా, కేంద్రం మంత్రిగా కిషన్ రెడ్డి కొసాగుతున్నారు. రెండు కీలక పదవులే కావడంతో పూర్తిస్థాయిలో క్యాడర్‌కు దిశానిర్దేశం చేయడంలో గ్యాప్ ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఇదిగో స్టేట్ చీఫ్, అదిగో స్టేట్ చీఫ్ అంటూ ఊదరగొట్టడం తప్ప నియమించింది లేదు. ప్రస్తుతం ఇండియా, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ టాస్క్ మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. ఘాటు కౌంటర్లు ఇవ్వడంలో పార్టీ వెనుకబడేందుకు స్టేట్ చీఫ్ నియామకం సైతం కారణంగా మారిందనే చర్చ జరుగుతోంది.
ఈ ఇష్యూపై స్పందించి ఇతర నేతలకు దూరమవ్వడం ఎందుకనే నేపథ్యంలో పలువురు సైలెంట్ అయినట్లుగా తెలుస్తోంది. ఈటలపై కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో పార్టీ తీరు గతంతో పోలిస్తే, కాస్త బెటర్ అనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్ష నియమాకం తర్వాత అయినా ఈ పరిస్థితి మెరుగవుతుందా? లేక ఇలాగే కొనసాగుతుందా అనేది చూడాలి.
Also Read: Ponguleti srinivas reddy: సమస్యల పరిష్కారంకు స్పీడ్ పెంచండి.. మంత్రి పొంగులేటి!