Anganwadi tenders
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Anganwadi tenders: అంగన్వాడీ టెండర్లలో గందరగోళం.. మంత్రినే భయపెడుతున్న అధికారులు!

  • ఆరోపణలు అంటూ రద్దు చేస్తున్న వైనం!
  • అప్పుడు కందిపప్పు, కోడిగుడ్లు.. ఇప్పుడు బెంచీలు
  • వారనుకున్న కంపెనీలకు టెండర్లు దక్కలేదనే ఇదంతా..
  • బెంచీల రద్దు వ్యవహారంలో బట్టబయలైన కుట్రలు
  • కమీషన్స్ ఇవ్వని ఎంఎస్ఎంఈలకు రాకుండా..
    అడ్డుకుంటున్న అధికారిణి.. పైగా మీడియాకు లీకులు
  • వార్తలు వస్తున్నాయంటూ ఏకంగా మంత్రినే భయపెట్టే ప్రయత్నం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల


స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం

Anganwadi tenders: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిదీ రాద్దాంతం చేయడం కామన్ అయిపోయింది. శిశు సంక్షేమ శాఖలో ఉన్నతాధికారులే కమీషన్స్ కోసం కార్పొరేట్ కంపెనీలకు టెండర్లు వచ్చేలా వ్యవహరిస్తున్నారు. చివరకు తక్కువ బిడ్డింగ్ వేశారని తెలుసుకుని రద్దు చేస్తున్నారు. తమకు అనుకూలమైన వారికి దక్కలేదని తెలియడంతో మీడియాకు లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు. వీరి వ్యవహార శైలి తెలుసుకున్న మెయిన్ స్ట్రీం మీడియా వార్తలు రాయకుంటే, యూట్యూబ్ ఛానల్స్‌కు లేనిపోని సమాచారం ఇచ్చి ఏకంగా మంత్రి సీతక్కనే భయాందోళనకు గురి చేసి టెండర్స్‌ను రద్దు చేయిస్తున్నారు.


బెంచీల టెండర్స్ లోపాలు

తెలంగాణలోని 35,781 అంగన్వాడీల్లో గర్భిణీలు కూర్చునేలా 70 వేల బెంచీలకు గత నెలలో టెండర్స్ పిలిచారు. మొదట పెట్టిన ఎలిజిబులిటీ ఏ కంపెనీలకు లేకపోవడంతో తగ్గించుకుంటూ వచ్చారు. ఒక్కొక్క బెంచ్‌కు 4 వేల కంటే ఎవరు తక్కువ బిడ్డింగ్ వేస్తారో వాళ్లకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు ఈ నెల 8న శాంపిల్స్ తెప్పించుకున్నారు. మొత్తం 8 కంపెనీలు శాంపిల్స్ తెచ్చాయి. ఇందులో నాలుగు కంపెనీలు మే 9న బిడ్డింగ్‌కు ఆన్ లైన్‌లో పేపర్స్ సబ్మిట్ చేశాయి. నేరుగా పత్రాలు ఇచ్చాయి. అయితే, శాంపిల్స్ టెండర్స్‌కు అనుకూలంగా లేకపోతే, టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్డింగ్‌కు అర్హత ఉండదు. అనుకున్న కార్పొరేట్ రెండు కంపెనీలే వస్తాయని అనుకుంటే మరో రెండు రావడంతో కుట్రలకు తెర తీశారు. ఎంఎస్ఎంఈ కంపెనీలైన శృతికేష్ ఇండస్ట్రీస్, ఏటీఎఫ్ కంపెనీలు బిడ్డింగ్ పేపర్స్ సమర్పించలేదని చివరి గంటలో కార్యాలయం నుంచి సిబ్బంది ఫోన్ చేశారు. హుటాహుటిన ఆఫీస్‌కు వెళ్లి స్టాఫ్ దాచిపెట్టిన ఫైల్‌ను తీసి ఇచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గడువు ముగిసినా కార్పొరేట్ కంపెనీలైన హల్లాడ, ఇన్నోవేటివ్ ఇంజినీర్స్‌కు 2.45 గంటల వరకు పేపర్స్ ఇచ్చేలా అవకాశం ఇచ్చారు.

Read Also- MLC Kavitha: మంత్రి సీతక్కపై కవిత సంచలన కామెంట్స్!

ఆన్ లైన్‌లో సబ్మిట్ చేసిన పత్రాల్లో అవకతవకలు

1. నెట్ వర్త్ సర్టిఫికెట్ సమర్పించలేదు
2. ప్రొసీడింగ్ ఫీజ్ రిసిప్ట్ అప్లోడ్ చేయలేదు
3. 100 డెలివరీ పాయింట్ డాక్యుమెట్స్ సబ్మిట్ చేయలేదు
4. గ్రీన్ చాక్ బోర్డుని ఫర్నీచర్ అనుభవంగా చూపించారు
5. గత నాలుగేళ్ల అనుభవంలో తేడాగా చూపించారు

ఇలా కార్పొరేట్ సంస్థలు ఆన్ లైన్‌లో సబ్మిట్ చేసిన పత్రాలపై ఎంఎస్ఎంఈలు అధికారులకు మెయిల్ చేశారు. దీంతో పాటు వారు ఎంత కోట్ చేశారో ఆ లిస్ట్‌ను కూడా అప్లోడ్ చేశారు. ఒక్కొక్క బెంచ్ తయారీకి రూ.3,800, రూ.3,750 అంటూ కోట్ చేశారు. బిడ్డింగ్ దాఖలు సమయం అయిపోయినందున ఆ ధర తెలిసినా అంతగా ఉపయోగం లేదు. సోమవారం (మే 12) ఫైనాన్షియల్ బిడ్డింగ్ ఓపెన్ చేయాల్సి ఉంది. అప్పటికే తెలంగాణకు చెందిన ఎంఎస్ఎంఈలు రూ.2,600కు బిడ్డింగ్ వేశారని తెలుసుకున్నారు. దీంతో ఓ ప్రముఖ యూట్యూబ్ రిపోర్టర్‌కు కమిషనర్ కార్యాలయం నుంచి లీకులు ఇచ్చారు. బెంచ్‌లను కూడా తినేస్తారా? అది కూడా ఆంధ్రా కంపెనీలకు కట్టపెడుతారా అంటూ ఆ జర్నలిస్టు రెచ్చిపోవడంతో, ఇద్దరు లేడీ ఐఏఎస్‌లు మంత్రి సీతక్క వీక్ నెస్‌ను పట్టుకుని ఇలా వాడేశారని ఆరోపణలు వస్తున్నాయి. మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది అంటూ సవ్యంగా చేయాల్సిన బిడ్డింగ్‌ను రద్దు చేయాల్సిందే అంటూ మంత్రికి హితబోధ చేశారు. సొంత కమీషన్స్ కోసం కార్పొరేట్‌ కంపెనీలకు దక్కలేదని వారి అనుభవాన్ని రంగరించి సమాచారం ఇచ్చారని విమర్శలు ఉన్నాయి. శాంపిల్స్ నచ్చలేదని వాళ్ళు వేసిన ధర తెలుసుకొని ఎంఎస్ఎంఈలను డిస్ క్వాలిఫై చేశారు.

కోడిగుడ్ల టెండర్లలోనూ ఇంతే..

గతంలో కోడిగుడ్ల టెండర్లు ఇలాగే రద్దయ్యాయి. పాత టెండర్లు కార్పొరేట్ కంపెనీలకు దక్కేలా అప్పటి ఎంపీ, మంత్రి డబ్బులు తీసుకుని దక్కించుకున్నారని ఇన్వెస్టిగేషన్ కథనాలు ఇచ్చాం. అదే కొనసాగించేలా కొత్త టెండర్లను రద్దు చేసేలా ప్లాన్ చేశారు. 6 నెలలుగా ఈ తంతు కొనసాగుతూనే ఉన్నది. కోర్టుకు వెళ్లి గుడ్డు సైజ్ తగ్గించి మరీ లాభాలు పొందుతున్నారు. ఇక కంది పప్పు టెండర్ క్యాన్సిల్ చేసింది అందరికీ తెలిసిందే. ఇద్దరు ఐఏఎస్‌లు మహిళలకు, శిశువులకు కావాల్సిన అవసరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న తీరులో టెండర్స్ కాకుండా అడ్డుపడుతున్నారని చెప్పడానికి అన్ని ఆధారాలు స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం వద్ద ఉన్నాయి. ఇకనైనా మారి కమీషన్స్ కోసం పాటుపడకుండా ప్రభుత్వానికి మేలు జరిగేలా ప్రజల సొమ్ము ఆదా చేసేలా ముందుకెళ్తే బాగుంటుంది. తక్కువ కోట్ చేసిన వారికి టెండర్ ఇస్తే సుమారు 8 కోట్లు మిగిలే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు వందో రెండొందలో తక్కువ వేసి కోట్ల రూపాయలు దోచుకునేవారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఏది చేసినా ప్రజలకు తెలుస్తుందని గ్రహించి మాయమాటలు, కమీషన్స్ కక్కుర్తి పనులు మానుకుంటే అధికారులకు మంచిదని ప్రజలు అనుకుంటున్నారు.

Read Also- Sumanth on Nagarjuna: నాగార్జున గురించి నమ్మలేని నిజాలు బయట పెట్టిన అక్కినేని సుమంత్

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు