42 Percent rcent BC Reservation( image credit;swetcha reporter)
తెలంగాణ

42 Percent rcent BC Reservation: బీసీలకు 42% రిజర్వేషన్ కోసం.. బీసీ చైతన్య వేదిక డిమాండ్!

42 Percent rcent BC Reservation: బీసీ చైతన్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వంగ అరుణ్ కుమార్ గౌడ్ ను నియమించినట్లు సంఘం జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాదులో బీసీ సాధికారత సంస్థ భవన్ లో సోమవారం బీసీ చైతన్య వేదిక తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నియామకాన్ని చేపట్టారు. కాగా నియామకం అనంతరం వంగ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలను చైతన్యం చేసి వారి హక్కుల కోసం ఉద్యమాలు చేపడుతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు.

విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని, కేంద్రం దీన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యతిరేకమైన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను తెలంగాణలో రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం 42% రిజర్వేషన్ బిల్లును కేంద్రానికి పంపించామని భావించి చేతులు దులుపుకోవద్దని, అమలు చేసే వరకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని వ్యాఖ్యానించారు.

 Also Read: Farmers concern: మల్టీ నేషనల్ కంపెనీల కుట్రలు.. రైతులకు న్యాయం ఎప్పుడంటే?

మన ఉద్యమాల ద్వారనే హక్కులు, ఆత్మ గౌరవం స్వయం పాలన సాధ్యమౌతుందని బి.సీ.లు సామాజికంగా విద్య, ఆర్థిక, రాజకీయ రంగాలల్లో అభివృద్ధి చెందాలని అందుకోసం ఐఖ్యత ఉద్యమాల ద్వారనే సాధ్యమని ఆయన తెలిపారు. ఇటీవల ఎప్రియల్ 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం జనగణనలో బి.సి. కుల గణన చేస్తామని ప్రకటించడాన్ని బి.సి. చైతన్య వేదిక స్వాగతిస్తుంది. అలాగే కులగణకు సంబంధించి స్పష్టమైన రూట్ మ్యాప్ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

విద్య, ఉద్యోగ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కోసం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంటులో బి.సి.ల కోసం 42% రిజర్వేషన్ చట్టం వెంటనే చేయాలని కోరారు. రాజ్యాంగ వ్యతిరేకమైన ఇ.డబ్ల్యూ. ఎస్. రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 Also Rad: Crime News: పట్టపగలే హత్య.. ప్లాన్‌ చేసి హతమార్చిన నిందితులు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కోసంఅసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించి చేతులు దులుపుకోకుండా 42% రిజర్వేషన్ తోనే స్థానిక సంస్థలలో ఎన్నికలు నిర్వహించాలి, అలాగే ప్రభుత్వ కాంట్రాక్ట్స్ వర్క్స్లో కూడా 42% రిజర్వేషన్ బీ.సి.లకు చట్టం చేయాలి. కాంగ్రెస్ పార్టి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బి.సి. లకు బడ్జెట్లో 42% నిధులు కేటాయించి, అలాగే అన్ని నామినేటెడ్ పదవులలో బి.సి.లకు 42% ఇచ్చి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చట్ట సభలలో మహిళలకు 33% రిజర్వేషన్ చట్టం చేసింది. అందులో కూడా బి.సి. మహిళలకు సబెకోటాకావాలని కేంద్ర ప్రభుత్వనాకి డిమాండ్ చేశారు.

ఇటీవల మహాత్మ జ్యోతిబా పూలే సినిమా వస్తే సెన్సార్ పేరుతో అడ్డుకోవడం ఆక్షేపనియం, బహుజనులందరు కుటుంబ సమేతంగా మహాత్మ పూలే సినిమాను వీక్షించాలని పిలుపునిచ్చారు. ఈ రోజుకు చరిత్రలో గొప్ప రోజు 1888 మే 11వ తేదిన 5 లక్షల మంది ప్రజలు కరతలధ్వనుల మధ్య జ్యోతిబా పూలేకు “మాహాత్మ” బిరుదు ఇచ్చారు, ఇప్పటికీ, ఎప్పటికీ జ్యోతిబా పూలే ఒక్కడే నిజమైన మహాత్ముడు. మహాత్మ జ్యోతిబా పూలే, మాతా సావిత్రి బాయి పూలే దంపతులకు కేంద్ర ప్రభుత్వం “భారత రత్న” బిరుదును ప్రదానం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

 Also Read: Etela Rajender: కూలిపోవడమే తెలంగాణ ప్రభుత్వానికి మిగిలింది?.. ఈటల రాజేందర్ ఫైర్!

ఈ సందర్భంగా బి.సి. చైతన్య వేదిక స్టేట్ ప్రెసిడెంట్ గా నన్ను నియమించిన జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ గారికి ఆయన కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో బి.సి. చైతన్య వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శులు సింధూ నాగేశ్వర రావు యాదవ్, తన్నీరు రమణయ్య, కుడిపుడి ఉమామహేశ్వర రావు,బి.సి. మేధావుల వేదిక నాయకులు అక్కల బాబు గౌడ్, ప్రజా కవి జన జ్వాలా రాధా కృష్ణ, బి.సి.సి.ఇ. కార్యదర్శి ఇంద్రవెల్లి రమేశ్ బి.ఎస్.ఐ. నాయకులుడివివి సత్య నారాయణ, లాలు నాయక్, రేణుక, దీపాదేవి, ధనుజయ చారి , వాసంశెట్టి శ్రీనివాస్,వల్లేపు వెంకటేష్, కొప్పుశెట్టి వెంకటేశ్వర రావు, వీరంకి ఆంజనేయులు గౌడ్, బి.సి. చైతన్య వేదిక నాయకులుఆంజనేయులు గౌడ్, సోమ భాస్కర్, విద్యార్థి నాయకులు ఎలగాని వెంకటేష్, రాజశేఖర్ గౌడ్, సురేష్ గౌడ్, మరియు తదీతరులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది