Mahesh Babu: స్టార్ హీరో మహేష్ బాబుకు (Mahesh Babu) ఈడీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అయితే, ఎవరూ ఊహించని విధంగా అతనికి నోటీసులు ఇవ్వడంతో ఇండీస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం, సాయి సూర్య డెవలపర్స్ కేసు విచారణ సాగుతోంది. అంతక ముందు షూటింగ్ లో బిజీగా ఉండటంతో రాలేకపోతున్నాను, మరో తేదీ కావాలంటూ ఈడీ అధికారులకు మెయిల్ పంపించారు.
సాయి సూర్య డెవలపర్స్ ప్రమోషన్ కోసం మహేష్ బాబు 5 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అందులో 3.4 కోట్ల నగదు, 2.5 కోట్ల RTGS ద్వారా తీసుకున్నట్లు తేల్చారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా మహేష్ బాబుకు నోటీలిచ్చారు.
Also Read: Railway Recruitment Board: గుడ్ న్యూస్.. రైల్వేలో 9,970 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి..
ఇప్పటికే వీటికి సంబందించిన ఆధారాలను సేకరించారు. సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మానీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయిసూర్య డెవలపర్స్ కంపెనీ నుంచి మహేశ్‌కు మొత్తం రూ.5.9 కోట్లు చెల్లించినట్లు ఈడీ అధికారులు ఆధారాలను కూడా సేకరించారు. చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు, నగదు రూపంలో రూ.2.5 కోట్లు చెల్లించినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే నేడు ఈడీ విచారణకు మహేష్ బాబు హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. విచారణకు వెళ్తే ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటారో చూడాలి.
దీనిపై స్పందించిన మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం అసలు నమ్మలేకపోతున్నారు. మహేష్ అన్న కూడా ఇలా చేశాడా అంటూ కొందరు షాక్ అవుతున్నారు. ఇంకొందరైతే యాడ్స్ ను చూసి పెట్టుబడులు పెట్టడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు