Actor vishal: హీరో విశాల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ లో ఎన్నో హిట్ మూవీస్ లో నటించాడు. అయితే,ఈ మధ్య కాలంలో విశాల్ వార్తల్లో నిలుస్తున్నాడు. ఎందుకంటే షూటింగ్స్ సమయంలో చాలా సార్లు గాయపడ్డాడు. అంతే కాకుండా, విశాల్ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడని తమిళ ఇండస్ట్రీ కోడై కూస్తుంది. ఇదిలా ఉండగా, తాజాగా విశాల్ ఓ లైవ్ ఈవెంట్ లో స్పృహ తప్పి పడిపోవడం అందర్ని షాక్ కి గురి చేసింది. అసలేం జరుగిందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Railway Recruitment Board: గుడ్ న్యూస్.. రైల్వేలో 9,970 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి..
విల్లుపురంలో జరిగిన ఓ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విశాల్ హాజరయ్యాడు. అయితే, చూస్తుండగానే అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే, దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు, చికిత్స అందించిన తర్వాత విశాల్ కోలుకున్నారు.గత కొంత కాలం నుంచి ఆయన ఆహారం సరిగా తీసుకోవడం లేదు. దాని వలనే ఇలా జరిగిందని తమిళ మీడియా వెల్లడించింది.
Also Read: Nagarjuna: నాగార్జున హీరోగా కొత్త సీరియల్.. బుల్లితెర ప్రేక్షకులకు పండగే.. ప్రోమో రిలీజ్
విశాల్ ఆరోగ్యం పై మేనేజర్ ఏమన్నాడంటే?
విశాల్ ఆరోగ్యం పై ఆయన మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. మధ్యాహ్నం ఆహారం తీసుకోకుండా, ఒక గ్లాస్ జ్యూస్ మాత్రమే తాగాడని, అందుకే ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడని వెల్లడించాడు.వైద్యులు అన్ని టెస్ట్ లు చేసి ఆయన క్షేమంగా ఉన్నారని తెలిపారు. సమయానికి ఫుడ్ తీసుకుంటే మళ్లీ నార్మల్ అవుతారని ఆయన తెలిపాడు.
అంతక ముందు కూడా ఓ సారి విశాల్ తీవ్ర అనారోగ్యంగా కనిపించారు. అప్పుడైతే అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇతను అసలు హీరో విశాలేనా అని చాలా మంది షాక్ అయ్యారు. స్టేజ్ పై రెండు నిముషాలు కూడా నిలబడలేకపోయాడు. అంతే కాదు, మైక్ పట్టుకొని గజ గజ వణికిపోయాడు. దాంతో ఆయన ఫ్యాన్స్ మా హీరోకి ఏమైదంటూ ఆరాలు తీయడం మొదలు పెట్టారు. అయితే, వైరల్ ఫీవర్ ఇంకా తగ్గలేదని, దానికి సంబందించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెబుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు