Harish Rao (imagecredit:twitter)
తెలంగాణ

Harish Rao: నీటి హక్కులను ఆంధ్రకు తాకట్టు పెడుతున్న కాంగ్రెస్.. హరీష్ రావు ఫైర్!

Harish Rao: సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల సంఘం, హైడ్రాలజీ అనుమతులు ఉన్నా కాంగ్రెస్‌ మాత్రం తెలంగాణ ప్రజలను తప్పుడు ప్రచారంతో మభ్యపెడుతున్నదని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా ఖండించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుకు తీసుకున్న అనుమతులకు సంబంధించి కాపీలను పోస్టు చేశారు. అబద్ధాలే ఆధారంగా అధికారంలోకి వచ్చి కాంగ్రెస్‌, ఇప్పుడు మళ్లీ అవే అబద్ధాలతో పాలన సాగిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదని హరీష్ రావు విమర్శించారు.

ఏడాదిన్నర పాలనలో కనీసం ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేని, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేని కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ సాధించిన సాగునీటి విజయాలను తమ ఘనతగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్ట్ దగ్గర ఫొటోలకు పోజులిచ్చి, అదే ప్రాజెక్టుపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రాజెక్టులు నిర్మించి నీళ్లు ఇవ్వడం మా తపన, ఫొటోలకు పోజులివ్వడం మీ ఘనతని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్‌ పాలనలో ఎడారిగా మారిన తెలంగాణ నేలని బీఆర్‌ఎస్‌ పాలనలో సస్యశ్యామలం చేశామన్నారు.

‘నిజం మౌనంగా ఉంటే, అబద్ధమే రాజ్యం ఏలుతుంది’ అనే ఈ సామెత కాంగ్రెస్ పార్టీ తీరుకు అతికినట్టు సరిపోతుందన్నారు. కాంగ్రెస్ చెబుతున్న ప్రతి అబద్ధానికి ఆధారాలతో సహా నిజాన్ని ప్రజల ముందుంచడం మా బాధ్యతగా భావిస్తున్నామన్నారు. 2018 ఆక్టోబర్ 30 న డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి అందజేసిందన్నారు. 2021 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే 113.795 టీఎంసీల నీళ్లు ప్రతిపాదిత సీతారామ ప్రాజెక్టుకు అందుబాటులో ఉన్నాయని సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం నిర్ధారించిందని తెలిపారు.

Also Read: Adi Srinivas: ఈటెలకు మతిపోయింది.. పిచ్చివాగుడు కట్టిపెట్టాలి.. ప్రభుత్వ విప్ ఫైర్!

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 70.4 టీఎంసీల నీటిని వినియోగించి 6.74 లక్షల ఎకరాలకు సాగు నీటిని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు ఇవ్వవచ్చని, తాగునీరుతోపాటు పారిశ్రామిక అవసరాలకు వాడుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం 2021లోనే నిర్ధారించిందని వెల్లడించారు. ఇంత స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్, హైడ్రాలజీ అనుమతులు ఉన్న సీతారామ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగలేదని, ప్రాజెక్టుకు అనుమతులు లేవని మాట్లాడడం మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అబద్ధపు ప్రచారాలకు పరాకాష్ట అని మండిపడ్డారు.

మరోసారి తెలంగాణ నీటిని అప్పనంగా కిందకు వదులుతూ రాష్ట్ర ప్రయోజనాలను ఏపీ కి తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ వంటి ప్రాజెక్టులు తెలంగాణకు నష్టం కలిగించి ఆంధ్రాకు లాభం చేకూర్చేలా చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా? అని నిలదీశారు. ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ హెడ్ వర్క్ ఆంధ్రాలో పెట్టి, శాశ్వతంగా తాళం వేసింది మీరే కదా? రాజీవ్ సాగర్ పైప్‌లైన్ కిన్నెరసాని వన్యప్రాణి కేంద్రం గుండా వేసి, అనుమతులు రాకుండా చేసింది మీరే కదా? అని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలే నాడు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేసి, పనులు నిలిపివేశారన్నారు. పర్యావరణ అనుమతులు రావడానికి కూడా అడ్డుపడ్డారు. కేంద్రం ఆటంకాలు, కాంగ్రెస్ కుట్రలను ఛేదించి 90 శాతం పనులను పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.

‘అనుమతులు లేవు’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యమే అన్నారు. టీఏసీ తప్ప అన్ని అనుమతులు పూర్తి చేశామని, అధికారులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలని సూచిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో ధనదాహంతో కళ్ళు మూసుకుని తెలంగాణ రైతులను అన్యాయం చేశారని, ఇప్పుడు మరోసారి తెలంగాణ నీటిని ఆంధ్రాకు తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రజలు గ్రహిస్తున్నారని హరీష్ రావు అన్నారు. ప్రతీ అంశం పై బీ ఆర్ ఎస్ పాలన పై దుమ్మెత్తి పోయడం కాకుండా మిగిలిపోయిన ప్రాజెక్టు పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ ని కోరారు.

Also Read: Karregutta Mulugu Effects: ఆదివాసీల ఊచకోతలు.. మావోయిస్టుల హింస.. కర్రెగుట్టల వాస్తవ కథనం!

 

Just In

01

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!