India Pak War (Image Source: AI)
సూపర్ ఎక్స్‌క్లూజివ్

India Pak War: పాక్ ఇంత నీచమైందా.. 1949 నుంచి తప్పు మీద తప్పు.. భారీ మూల్యం తప్పదా!!

India Pak War: గత నాలుగు రోజులుగా భారత్, పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు శనివారం సాయంత్రం భారత విదేశాంగశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గంటలు సైతం గడవముందే పాక్.. ఈ ఒప్పందానికి తూట్లు పొడించింది. తన వక్రబుద్ధిని చాటుకుంటూ సరిహద్దుల్లోని పంజాబ్, జమ్ముకశ్మీర్ లపైకి డ్రోన్ల దాడికి యత్నించింది. దీంతో ఈ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని.. దీంతో ఎదురుదాడి చేసేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని భారత విదేశాంగ కార్యదర్శి సైతం ప్రకటించారు. అయితే పాక్ ఇలా శాంతి స్థాపన, కాల్పుల విరమణ ఒప్పందాన్ని బ్రేక్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలాసార్లు ఈ అగ్రిమెంట్ ను పక్కన పడేసింది. ఇప్పటివరకూ భారత్ – పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాల గురించి ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.


1949 – కాశ్మీర్ యుద్ధం అనంతరం
స్వాతంత్రం తర్వాత భారత్ – పాక్ మధ్య తొలి కాల్పుల విరమణ ఒప్పందం 1949లో జరిగింది. కశ్మీర్ యుద్ధం అనంతరం 1949 జనవరి 1న ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ ఒప్పందం కుదిరింది. దీని ద్వారా సీజ్ లైన్ (Ceasefire Line) ఏర్పడింది. ఆ లైన్ దాటి అటు పాక్ గానీ, ఇటు భారత్ గానీ వెళ్లకూడదని ఒప్పందానికి వచ్చాయి.

1965 యుద్ధం – తాష్కెంట్ ఒప్పందం (Tashkent Agreement)
భారత్ – పాక్ మధ్య 1966 జనవరి 10న ఈ శాంతి ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య 1965 ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య జమ్ము కాశ్మీర్ లక్ష్యంగా యుద్ధం జరిగింది. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మరిన్ని రోజులు కొనసాగితే ఇతర దేశాలు సైతం అందులో పాలు పంచుకునే అవకాశముందని అప్పటి సోవియేట్ యూనియన్, అమెరికాలు భావించాయి. తాష్కెంట్ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు కృషి చేశాయి. అయితే ఒప్పందం కొద్దికాలం పాక్షిక శాంతిని తీసుకొచ్చినప్పటికీ ఆ తర్వాత నుంచి పాక్ దాడులు కొనసాగాయి.


1971 యుద్ధం – శిమ్లా ఒప్పందం (Shimla Agreement)
1972 జులై 2న భారత్ ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్థాన్ ప్రధాని భుట్టో మధ్య ఈ ఒప్పందం జరిగింది. దీని ద్వారా సీజ్ ఫైర్ లైన్ (Ceasefire Line) ను Line of Control (LoC)గా మార్చారు. దీని ద్వారా కాల్పుల విరమణ, శాంతిని స్థిరంగా ఉంచే ప్రయత్నం జరిగినా అది ఎంతోకాలం నిలబడలేదు. పాక్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతూనే వచ్చింది.

2003 కాల్పుల విరమణ ఒప్పందం
2001-2002లో భారత పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తలు మరోమారు తారాస్థాయికి వెళ్లాయి. సరిహద్దుల్లో ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు నవంబర్ 26, 2003న నియంత్ర రేఖ వెంబడి భారత – పాక్ కాల్పుల విరమణనకు అంగీకరించాయి. ఈ ఒప్పందం కాశ్మీర్ తో పాటు సరిహద్దుల్లో శాంతిని స్థాపించడంలో సహాయపడింది. అయితే కొద్దికాలం తర్వాత నుంచి ఉగ్రవాద దాడులు, పాక్ సైన్యం కవ్వింపు చర్యలు కొనసాగుతూ వచ్చాయి.

2021 పునరుద్ధరణ ఒప్పందం
బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్, పుల్వామా దాడి వంటి ఘటనలతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో LoC వెంబడి కాల్పులు, ఘర్షణలు పెరిగాయి. దీంతో పరిస్థితులను చల్లార్చేందుకు ఫిబ్రవరి 25, 2021న ఇరుదేశాల మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయిలో చర్చలు జరిగాయి. 2003 కాల్పుల విరమణ ఒప్పందాన్ని కఠినంగా అమలు చేయడానికి అంగీకరించాయి. ఈ ఒప్పందం తర్వాత సరిహద్దులో ఉద్రిక్తతలు కొంతవరకు తగ్గాయి. అయితే ఈ ఒప్పందాన్ని అడపాదడపా పాక్ ఉల్లంఘిస్తూనే వచ్చింది.

Also Read: Gold Rate Today : భారీ గుడ్ న్యూస్.. గోల్డ్ కొనాలనుకునే వారు ఇప్పుడే కొనేయండి!

2025 కాల్పుల విరమణ ఒప్పందం
2025 ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. భారత్ పైకి పాక్ మిసైళ్లు, డ్రోన్లు, యుద్ధ విమానాలను పంపగా భారత్ తనదైన శైలిలో వాటిని కూల్చివేసింది. అదే సమయంలో పాక్ లోకి వెళ్లి ఆ దేశ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేసింది. పరిస్థితులు మరింత ముదురుతుండటంతో అమెరికా చొరవతో కాల్పుల విరమణ ఒప్పందానికి మే 10న అంగీకారం కుదిరింది. అయితే కొద్ది గంటల్లోనే ఓ ఒప్పందాన్ని పాక్ బ్రేక్ చేయడంతో ఉద్రిక్తతలు మళ్లీ మెుదలయ్యాయి.

Also Read This: Karregutta Mystery: కర్రెగుట్టల్లో అంతు చిక్కని రహస్యం.. అత్యంత విలువైన లోహాలు.. పెద్ద స్టోరీనే!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు