Shrasti verma: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం సంచలనం సృష్టించింది. ఓ లేడీ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించాడంటూ జానీపై ఆరోపణలు చేయడంతో పాటు కేసు పెట్టింది. అంతే కాదు, ఆమె ధైర్యంగా మీడియా ముందుకొచ్చి ఎందుకు జానీపై కేసు పెట్టిందో కూడా కీలక విషయాలను బయటకు వెల్లడించింది. అయితే, నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియా హల్చల్ చేస్తోంది.
శ్రేష్టి వర్మ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో షాకింగ్ నిజాలను వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ ” ఒక అమ్మాయి అలా చేసిందంటే .. లోపల ఎంత వేదన అనుభవించిందో కూడా తెలుసుకోవాలి. కొందరు నన్ను తప్పుబడుతున్నారు. ఈ రోజూ నేను అయ్యాను.. రేపు ఇంకొకరు.. ఆ తర్వాత వేరే వాళ్ళు .. ఇలా ఎంత మంది ఇబ్బందులు పడాలి. అందుకే నేను బయటకు వచ్చా అంటూ గట్టిగా చెప్పింది. నేను సొంతగా కొరియోగ్రఫీ చేయకూడదా? గురువు ఎక్కడైనా తన శిష్యులు ఎదుగుతుంటే సంతోషించాలి కానీ, ఇక్కడ ఆయన , తన భార్య మాత్రం బాధ పడుతున్నారు. జానీ మాస్టర్ చూపించిన వాటిలో నిజం లేదని నేను అంటాను. నేను సూటిగా ఒక్క ప్రశ్న మాత్రమే అడుగుతున్నా .. ఆయన తప్పు లేదని అంటున్నాడు కదా .. సరే లేకపోతే నిరూపించమని అడగండి. నేను ఆయనకి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ” అంటూ సంచలన కామెంట్స్ చేసింది.
Also Read: Somu Veerraju On Narayana: సీపీఐ నారాయణ పాకిస్థాన్ వెళ్లిపోవాలి.. ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు..
శ్రేష్టి వర్మ పై కేసు
రెండు రోజుల క్రితం శ్రేష్టి వర్మ పై కొందరు కేసు నమోదు చేశారు. దీనికి సంబందించిన వార్తా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. స్వాతంత్ర సమరయోధులను గౌరవించకుండా, హేళన చేస్తూ ఇలా ఎలా మాట్లాడుతుంది. హద్దులు దాటి ఇలా మాట్లాడిన సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ పై కఠిన చర్యలు తీసుకొని తక్షణమే FIR నమోదు చేయాలని పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.