Etela Rajender: రాష్ట్ర ప్రభుత్వానికి తలా తోకలేదని, తెలంగాణలో ఈ సర్కార్ ఇంకా ఎన్నో రోజులు కొనసాగదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి లోని పూజిత అపార్ట్మెంట్ నివాసులకు హైడ్రా నోటీసులు ఇవ్వడంతో బాధితులకు భరోసా కల్పించేందుకు ఆయన శనివారం అక్కడికి వెళ్లి మాట్లాడారు. అపార్ట్మెంట్ కూలగొడతామంటూ నోటీసులు ఇవ్వడంపై ఈటల ఆగ్రహం వ్యక్తంచేశారు.
Also Read: UP Minister Narendra Kashyap: ఓబీసీలు సంఖ్యలో ఎక్కువ.. హక్కుల్లో తగ్గతనమే ఎందుకు?
ఇది తుగ్లక్ ప్రభుత్వమని, ముఖ్యమంత్రి ఓ తుగ్లక్ అంటూ విరుచుకుపడ్డారు. సీఎం.. ఒక శాడిస్ట్ అని, సైకో అని, అందుకే ప్రజలను ఏడిపిస్తున్నావంటూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఉందని, గ్రౌండ్ రియాలిటీ ఏంటో సీఎం తెప్పించుకుని మాట్లాడి సమస్యలను పరిష్కరించారని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఏం జరుగుతున్నాయనే అంశాలై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా సిస్టంను బాగుచేసుకోవాలని సూచించారు. ప్రజల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.
ప్రజల జీవితాలతో ఆడుకున్న ఎవరూ బాగుపడడని శపించారు. నోటీసు ఇచ్చింది ఎమ్మార్వో అని, తాను కలెక్టర్ కు ఫోన్ చేస్తే తనకు తెలియదని చెప్పడమేంటని ఈటల ఫైరయ్యారు. ఇక్కడి ప్రజలు అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకున్నారని, మరి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు అధికారుల బుద్ధి, జ్ఞానం ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజల బిల్డింగులు కూల్చివేయవచ్చని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రజలు పగ, కసితో ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు