Telangana MLAs: తెలంగాణ కొన్ని జిల్లాల్లోని ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో పెండింగ్ ప్రాజెక్టులు, వర్క్స్ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డెవలప్ మెంట్ కు ప్రత్యేక నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు దాటిపోయిందని, ఇప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని పలువురు ఎమ్మెల్యేలు మంత్రులకు వివరిస్తున్నారు. వెంటనే తమ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా తీసుకొని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదని వివరిస్తున్నారు. లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోతామని కొందరు నేరుగానే మంత్రులకు వివరిస్తున్నారట. కొన్ని సందర్భాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య స్వల్ప వివాదాలు కూడా జరుగుతున్నాయి.
గ్రామాల్లో సంపూర్ణంగా తిరగలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఎమ్మెల్యేలు మొ ర పెట్టుకుంటున్నారు. దక్షిణ తెలంగాణలోని ఎమ్మెల్యేలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కుంటున్నట్లు పార్టీ లోని ఓ కీలక నేత తెలిపారు. మినిస్టర్ల జిల్లా టూర్లలో సమస్యలు, వివాదాలు బయట పడుతున్నాయి. తాము నియోజకవర్గాల్లో సంపూర్ణంగా పని చేసుకోవాలంటే నిధులుకేటాయించాల్సిందేనంటూ మంత్రులపై ఎమ్మెల్యేలు ప్రెజర్ తీసుకురావడం గమనార్హం. నిధులు లేవని ఎన్నిసార్లు చెప్తారంటూ ఇటీవల ఓ మంత్రిని ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు సున్నితంగానే నిలదీసినట్లు సమాచారం. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేని పక్షంలో తాను కూడా ఏమీ చేయలేనని సదరు మంత్రి ఆయా ఎమ్మెల్యేలకు వివరించినట్లు ఓ కీలక నేత ఆఫ్‌ది రికార్డులో వెల్లడించారు.
సార్ ఏం చేద్దాం? జనాలు అడుగుతున్రు?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. డిక్లరేషన్లు, గ్యారంటీల పేరిట ప్రత్యేక డాక్యుమెంట్లు రూపొందించి మరీ ప్రకటించారు. కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితుల ఆధారంగా హామీలు ఇచ్చారు. ఏడాదిన్నర పూర్తైన తర్వాత కూడా వాటి అమల్లో జాప్యం నెలకొనడంతో స్థానిక కేడర్ నుంచి ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇంకా ఎప్పుడు చేస్తాం సార్ అంటూ శాసన సభ్యులు, మంత్రుల పర్యటనల్లో క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి.
Also Read: India Big Warning: పాక్‌కు భారత్ బిగ్ వార్నింగ్.. ఇక ఏం జరిగినా యుద్ధమే..
ముగ్గురు మంత్రులు ఉన్న నియోజకవర్గాల్లో ఈ సమస్య అత్యధికంగా ఉన్నట్లు స్వయంగా అధికారులే చెప్తున్నారు. కేవలం మంత్రుల నియోజకవర్గాల్లోనే డెవలప్ అంటే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏమిటీ ? అంటూ మరి కొంత మంది ఎమ్మెల్యేలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన సీఎల్పీ మీటింగ్ లోనూ కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. తన జిల్లా టూర్లలో అంతా చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు.
మార్క్ కోసం తాపత్రాయం
కాంగ్రెస్ పాలనలో తమ మార్క్ కనిపించేలా ఎమ్మెల్యేలు జాగ్రత్త పడుతున్నారు.పదేళ్ల తర్వాత తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో డెవలప్ మెంట్ పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ప్రధానంగా దవాఖాన్లు, రోడ్లు, ప్రభుత్వ స్కీమ్ లపై ప్రజాప్రతినిధులు దృష్టి కేంద్రీకరించారు. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆయా అధికారులకు అందజేశారు. అయితే మంత్రుల నుంచి సరైన సపోర్టు లభించడం లేదనే అసంతృప్తి వ్యక్తం ఆయా ఎమ్మెల్యేల నుంచి వ్యక్తం అవుతున్నది.
గడిచిన పదేళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలించడంతో ప్రస్తుతం రాష్ట్రమంతటా బీఆర్ఎస్ మొదలు పెట్టిన కార్యక్రమాలు, డెవలప్ మెంట్లు, ప్రోగ్రామ్ ల శిల ఫలకాలు, ప్రారంభోత్సవ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వీటి ప్రభావం తగ్గించాలంటే తమ పేరిట కొత్త కొత్త ప్రోగ్రామ్ లు, డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేయాలని ఎమ్మెల్యేలు ఆసక్తితో ఉన్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు రోడ్లు, ఆసుపత్రులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
Also Read: Electrical Supply Stores: భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్‌కు సిద్దం.. సమీక్షలో కీలక నిర్నయాలు!