MLA Harish Rao: ఉగ్రవాదం అంతమై భారతదేశంలో శాంతి నెలకొనాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆకాంక్షించారు. దుర్గా ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో సిద్దిపేటలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో 108 హోమగుండాలతో శనివారం హనుమాన్ యజ్ఞం నిర్వహించారు. ఈ హనుమాన్ యజ్ఞంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దుర్గాప్రసాద్ స్వామీ ఆశీస్సులతో చేసే ఈ హోమం ఫలించాలని కోరుకున్నారు.
Also Read: India Big Warning: పాక్‌కు భారత్ బిగ్ వార్నింగ్.. ఇక ఏం జరిగినా యుద్ధమే..
దుర్గాప్రసాద్ స్వామీజీ చేతుల మీదుగా హోమం సిద్దిపేటలో జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో ఈ భక్తి కార్యక్రమాన్ని మొట్టమొదటగా సిద్దిపేటలో ప్రారంభించడం జరిగిందన్నారు. యువతను భక్తి మార్గంలో నడిపించి, క్రమశిక్షణతో సన్మార్గంలో నడిచేందుకు ఈ హనుమాన్ దీక్ష ఉపయోగపడుతుందని తెలిపారు. దీక్ష సమయంలో యువకులు మండుతున్న ఎండలో చెప్పులు లేకుండా తిరుగుతూ భక్తి భావాన్ని కలిగిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: Wildlife Protection Act: వన్యప్రాణి సంరక్షణ చట్ట ఉల్లంఘన.. జింక మాంసం స్వాధీనం!
ప్రజలు మంచి మార్గంలో వెళ్లడానికి హనుమాన్ భక్తులు స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. భగవంతుడిని,తల్లిదండ్రులను పూజిస్తూ, కష్టాన్ని నమ్ముకుని యువకులు నిజాయితీతో జీవితంలో పైకి రావాలని సూచించారు.తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు చెప్పారు. పహల్గాంలో అమాయకులైన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడం కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పాకిస్తాన్‌లోనీ ఉగ్రవాదులను ఏరి వేయడానికి భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తోందన్నారు. భారత సైనికులకు బలాన్ని అందించి, ఉగ్రవాదులపై విజయం సాధించాలని కోరుకున్నారు. అనంతరం సిద్దిపేట పట్టణం రంగాధాంపల్లిలోని హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా నిర్మించిన అన్నదాన భవనాన్ని ప్రారంభించి, హనుమాన్ స్వాములతో కలసి బిక్ష చేశారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు