Amala Paul: సీనియర్ హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం తమిళ మూవీస్ చేస్తుంది. తెలుగులో రామ్ చరణ్ తో నాయక్ , అల్లు అర్జున్ తో ఇద్దరూ అమ్మాయిలతో , నాగ చైతన్య బెజవాడ లో తో నటించి అందర్ని మెప్పించింది. అయితే, తాజాగా ఈమె చేసిన సంచలన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: Somu Veerraju On Narayana: సీపీఐ నారాయణ పాకిస్థాన్ వెళ్లిపోవాలి.. ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు..
అమలాపాల్ ఓ నటి అన్న విషయం తన భర్తకు తెలీదట.. ప్రెగ్నెంట్ అయిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మీరు విన్నది నిజమా ? కాదా అని సందేహిస్తున్నారా? మీరు విన్నది నూటికి నూరు శాతం నిజమే. ఇటీవలే జేఎఫ్ డబ్ల్యూ మూవీ అవార్డ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. అయితే, దానిలో ఈ హాట్ బ్యూటీ ఉత్తమ నటిగా(క్రిటిక్స్) అవార్డ్ పొందింది.
ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ.. జగత్ దేశాయ్ తో ప్రేమ, పెళ్లి ఎలా జరిగిందనే విషయాల గురించి అందరికీ చెప్పింది. ” మేమిద్దరం గోవాలో కలిశాం. అతడు గుజరాతీ కానీ గోవాలో ఉంటున్నాడు. తనతో నేను కేరళ అమ్మాయిని అని చెప్పాను. అతడు దక్షిణాది చిత్రాలు ఒక్కటి కూడా చూడడు. దీంతో, నేను నటి అనే విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదు. ఆ ఒక్క విషయం తన దగ్గర దాచాను. ఆ తర్వాత నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం ” అంటూ అందరూ షాక్ అయ్యే నిజాల గురించి అమలాపాల్ ఓపెన్ గా చెప్పుకొచ్చింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.