Natural Star Nani
ఎంటర్‌టైన్మెంట్

Natural Star Nani: శత్రువులకి ఆ శాటిస్‌ఫ్యాక్షన్ ఇవ్వకూడదనే ఈ ఫంక్షన్ పెట్టా..

Natural Star Nani: నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘HIT: ది 3rd కేస్’. మే1న విడుదలైన ఈ సినిమా కేవలం విడుదలైన వారం రోజుల్లోనే బ్రేకీవెన్ సాధించి, లాభాల బాటలో నడుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌ని కూడా రీచ్ అయింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్’ ఫ్రాంచైజీగా వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోన్న సందర్భంగా చిత్రయూనిట్ శుక్రవారం బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత యుద్ధ పరిస్థితులను ఉద్దేశిస్తూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read- Kayadu Lohar: కయదు లోహర్ టైమ్ నడుస్తోంది.. లేకపోతే ఏంటీ ఆఫర్స్!

ఈ సక్సెస్ మీట్‌లో నాని మాట్లాడుతూ.. ఈ సక్సెస్ సెలబ్రేషన్ గురించి టీమ్‌తో చర్చిస్తున్నప్పుడు దేశంలో ప్రస్తుత పరిస్థితి సెన్సిటివ్‌గా ఉంది కదా.. ఇప్పుడు సెలబ్రేషన్స్ చేయవచ్చా? అనే చర్చ జరిగింది. శత్రువులు మనకి ఒక ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేయాలని ప్రయత్నించారు. దానికి మన దేశం, సైన్యం చాలా హుందాగా బదులు చెప్పింది. శత్రువులు చేసిన పని కారణంగా ఇండియాలో ఒకచోట సక్సెస్ సెలబ్రేషన్ ఆగిపోయిందనే శాటిస్‌ఫ్యాక్షన్ వాళ్లకి ఇవ్వకూడదని ఉద్దేశంతోనే ఈ సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనల్ని ఏమీ చేయలేకపోయారనే స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. లెట్స్ సెలబ్రేట్.. లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ. సైన్యంలో ఉన్న అందరికీ నా, మా టీమ్ తరపు నుంచి బిగ్ సెల్యూట్.

‘హిట్ 3’ సినిమా విషయానికొస్తే ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నేను ఊహించలేదు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని ఒక బిగ్ మాస్ కమర్షియల్ సినిమాలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. థియేటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే అద్భుతంగా అనిపించింది. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. తెలుగు సినిమాలో ఎప్పుడు చూడని ఫైట్స్‌ని ఆడియన్స్ చూశారు. శైలేష్‌తో వర్క్ చేయడం చాలా ఫన్‌గా ఉంటుంది. తను చాలా కూల్ పర్సన్. తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. ప్రతి సినిమాకి తను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాడు. తనకి హిలేరియస్ కామెడీ టైమింగ్ ఉంది. తనతో ఈసారి నేను చేయబోయే సినిమా మాత్రం మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఓ ఆలోచన చెప్పాడు.. చాలా బాగుంది. త్వరలోనూ ఆ కోరిక తీరవచ్చ.

Also Read- OTT Movies: ఓటీటీ ప్రియులకు ఈ వారం పండగే.. ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా!

ఇది చాలా స్పెషల్ డే (మే 9). నా ఫేవరెట్ ఫిల్మ్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీ రిలీజ్ అయింది. ‘హిట్3’ సక్సెస్ సెలబ్రేషన్ జరుగుతోంది. శ్రీ విష్ణు ‘సింగిల్’ సినిమా రిలీజైంది. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కామెడీ చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే సమంత నిర్మించిన ‘శుభం’ సినిమా గురించి కూడా చాలా మంచి రిపోర్ట్స్ విన్నాను. అన్ని సినిమాలు అద్భుతంగా ఆడాలి. ‘హిట్ 3’ వండర్ ‌ఫుల్ జర్నీ. ఒక బ్లాక్ బస్టర్‌తో కంప్లీట్ చేస్తున్నాం. 2025 అటు ‘కోర్ట్’, ఇటు ‘హిట్ 3’.. వెరీ మెమరబుల్ ఇయర్. 2026 దీన్ని మించి ల్యాండ్ చేయడానికి మన ప్రయత్నం చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ