OTT Movies List
ఎంటర్‌టైన్మెంట్

OTT Movies: ఓటీటీ ప్రియులకు ఈ వారం పండగే.. ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా!

OTT Movies: ప్రస్తుతం థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. కారణం కరోనా టైమ్‌లో ఇంటిలోనే ఉన్న జనాలకు ఎంటర్‌టైన్‌మెంట్‌ని రుచి చూపించిన ఓటీటీలు. అవును, కరోనా టైమ్‌లో అది, ఇది అని కాకుండా కనిపించిన సినిమాలను, సిరీస్‌లను జనాలు పడిపడి చూశారు. వారికి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఓటీటీ అనే భావన వచ్చేసింది. అందులోనూ ఒక ఫ్యామిలీ మొత్తం సినిమాకు వెళ్లాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఏదో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌కి వాడుకుంటే సంవత్సరమంతా ఇంట్లోనే, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చనేది ప్రేక్షకులలోకి వెళ్లిపోయింది. అందులోనూ థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేంత ఓపిక, సహనం రోజురోజుకూ ప్రేక్షకులలో తగ్గిపోతుంది. అందుకే, ఓటీటీలకు అలవాటు పడ్డారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్లకి వెళ్లాలంటే, ఆ సినిమా స్టార్ హీరోది అయినా అయ్యిండాలి, లేదంటే బీభత్సమైన పాజిటివ్ టాక్‌ని తెచ్చుకునైనా ఉండాలి. అలా అయితేనే, ప్రేక్షకులు ఇంటిని వదిలి థియేటర్లకు వెళుతున్నారు.

ఇంక కొందరు ఉంటారు. బిగ్ స్క్రీన్ అనుభవానికి అలవాటు పడ్డవాళ్లు. వాళ్లు ఏ సినిమా వచ్చినా, థియేటర్లలోనే చూడాలని భావిస్తుంటారు. ఇలాంటి వారి వల్లే ఇంకా థియేటర్లలో సినిమా బతికి ఉందని చెప్పుకోవచ్చు. ముందు ముందు ఈ జాబితాలో కూడా మార్పు రావచ్చు. ఎందుకంటే, ఓటీటీలు అలా ఆకర్షిస్తున్నాయి మరి. ఇక విషయానికి వస్తే.. థియేటర్లలో సమంత నిర్మించిన ‘శుభం’, శ్రీ విష్ణు ‘సింగిల్’ సినిమాలు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండగా.. ఓటీటీలలో మాత్రం ఈ వారం ప్రేక్షకులకు పండగే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు అన్ని ఓటీటీలలో కలిపి దాదాపు 30కి పైగా సినిమాలు ఈ వారం ఓటీటీలలోకి వచ్చాయి. అందులో అజిత్ కుమార్, సిద్ధు జొన్నలగడ్డల సినిమాలతో మరికొన్ని పేరున్న సినిమాలు కూడా వచ్చాయి. మరెందుకు ఆలస్యం.. ఈ వారం ఓటీటీలలో దిగిన సరుకేంటో ఓ లుక్కేసుకోండి.

Also Read- Aarti Ravi: పబ్లిగ్గా సింగర్‌తో జయం రవి హల్చల్.. భార్య ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో..
ఓదెల 2 (తెలుగు)
టెన్ అవర్స్ (తమిళం)
నడికలిల్ సుందరి యమున (మలయాళం)
ఔసెప్పింటే ఒసియాతు (మలయాళం)
వామన (కన్నడ)
ఏ బిట్టర్ స్వీట్ లైఫ్ (కొరియన్)
ఆఫ్టర్ 30 (నైజీరియన్)
గ్రామ చికిత్సాలయ్ (హిందీ వెబ్ సిరీస్)
ఆక్టోపస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

నెట్‌ఫ్లిక్స్‌లో
జాక్ (తెలుగు)
గుడ్ బ్యాడ్ అగ్లీ (తెలుగు డబ్బింగ్ మూవీ)
ద డిప్లమాట్ (హిందీ)
ద రాయల్స్ (హిందీ)
నోన్నాస్ (ఇంగ్లీష్)
కరోల్ జీ (ఇంగ్లీష్)
బ్యాడ్ ఇన్ఫ్లూయెన్స్ (స్పానిష్)
హోల్డ్ మీ క్లోజ్ (తగలాగ్)
ఫరెవర్ (తెలుగు డబ్బింగ్ సిరీస్)
బ్లడ్ ఆఫ్ జ్యూస్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)
టూ హ్యాండిల్ టూ ఇటాలియన్ సీజన్ 1 (ఇటాలియన్ సిరీస్)

Also Read- Balakrishna: వాళ్లని గదిలోకి తీసుకెళ్లి బాలయ్య ఏం చేసేవాడంటే.. దర్శకుడు షాకింగ్ కామెంట్స్!

సన్ నెక్స్ట్‌లో
కాలమే కరిగింది (తెలుగు)

జియో హాట్ స్టార్‌లో
ఎమర్జెన్సీ డిక్లరేషన్ (హిందీ)
కొనన్ ఒబ్రియన్ మస్ట్ గో సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)
పోకర్ ఫేస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)

జీ5 లో
రాబిన్ హుడ్ (తెలుగు)
బొహురూపీ (బెంగాలీ)

ఆహా లో
అస్త్రం (తమిళం)

బుక్ మై షో లో
బ్లాక్ బ్యాగ్ (ఇంగ్లీష్)
లాస్ట్ స్విమ్ (ఇంగ్లీష్)
ఇట్స్ కమింగ్ (ఇంగ్లీష్)
హూ బై ఫైర్ (ఫ్రెంచ్)

ఇంకొన్ని ఓటీటీలలో కూడా ఈ వారం ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లే దిగాయి. మరి వీటిలో మీకు నచ్చిన సినిమాలను, సిరీస్‌‌లను ఈ వీకెండ్ చూసి ఎంజాయ్ చేయండి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు