Kayadu Lohar
ఎంటర్‌టైన్మెంట్

Kayadu Lohar: కయదు లోహర్ టైమ్ నడుస్తోంది.. లేకపోతే ఏంటీ ఆఫర్స్!

Kayadu Lohar: సినిమా ఇండస్ట్రీ అనే కాదు.. ఏ ఇండస్ట్రీలోనైనా కాస్త లక్ ఉండాలి. అది ఉన్నప్పుడు ఎవరేం చేసినా, చెల్లుబాటు అవుతుంది. అది లేనప్పుడు ఎంత గొప్ప పని చేసినా, దానికి తగిన గుర్తింపు రాదు. సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే, ఎవరు ఎప్పుడు, ఎందుకు ఫేమస్ అవుతారో చెప్పడం కష్టం. స్టార్ హీరోలు కూడా ఎంతో కష్టపడి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతాయి. అదే స్టార్ హీరోలు, సింపుల్‌గా కనిపించినా, ‘జైలర్’ సినిమాలా బ్లాక్‌బస్టర్ అవుతుంటాయి. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ఏ హీరోయిన్ ట్రెండ్ ఎప్పుడు నడుస్తుందో ఇక్కడ చెప్పడం కష్టం. టాలీవుడ్‌నే గమనిస్తే.. మొన్నటి వరకు పూజా హెగ్డే (Pooja Hegde) పేరు టాప్‌లో ఉంది. ఎప్పుడైతే రష్మిక మందన్నా (Rashmika Mandanna) సినిమాలు సక్సెస్ అవడం మొదలెట్టాయో.. పూజా గ్రాఫ్ అమాంతం పడిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆమె పేరే వినబడటం లేదంటే, లక్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Also Read- OTT Movies: ఓటీటీ ప్రియులకు ఈ వారం పండగే.. ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా!

ఇప్పుడిదే కోవలోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. యంగ్ హీరోయిన్ కయదు లోహర్. ఈ భామ పేరు ఇప్పుడు ఎలా వైరల్ అవుతుందో తెలిసిందే. కోలీవుడ్, టాలీవుడ్ అనే కాదు, ఇతర ఇండస్ట్రీలలోని హీరోల కళ్లు కూడా కయదుపైనే ఉన్నాయంటే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీనికి కారణం మాత్రం ఆమె గ్లామర్ మహత్యమే. వాస్తవానికి కయదు లోహర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో ఇచ్చింది. అప్పుడామెకు లక్ కలిసి రాలేదు. కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా పేరున్న శ్రీ విష్ణు హీరోగా చేసిన ‘అల్లూరి’ సినిమాలో ఆమెనే హీరోయిన్. కానీ ఆ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ దొరకలేదు. అయినా గ్లామర్ విషయంలో వెనుకాడలేదు. కాకపోతే ఆ సినిమా పరంగా కయదుని, ఆమె గ్లామర్‌ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె కోలీవుడ్ తిరుగు ప్రయాణం కట్టింది.

కోలీవుడ్‌లో కూడా ఆమెకు మొదట్లో అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. ఆమెకు వచ్చిన అవకాశాలు కూడా పెద్ద సక్సెస్ కాలేదు. అంతే, కయదు పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, ఏం మాయ చేసిందో, ఏమో గానీ.. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత నవ నవలాడే అందాలతో దర్శనమిచ్చి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అవును, ఇప్పుడీ భామ లక్ ఎలా ఉందంటే.. టాలీవుడ్, కోలీవుడ్‌లలో బిజీ నటిగా మారిపోయింది. స్టార్ హీరోల సరసన ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్‌గా వచ్చిన ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’ చిత్రం హిట్టవడం, అందులో కయదు లోహర్ పాత్రకి మంచి స్క్రీన్ ప్లేస్, దానికి తగినట్లుగా ఆమె కనిపించిన తీరు.. అన్నీ కూడా కుర్రాళ్ల గుండెల్లో ఆమెకు స్థానం లభించేలా చేశాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉన్న వీడియోలే. అలా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది కయదు లోహర్.

Also Read- Aarti Ravi: పబ్లిగ్గా సింగర్‌తో జయం రవి హల్చల్.. భార్య ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఇంకా ఆమె క్రేజ్ గురించి చెప్పాలంటే.. నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమాలో హీరోయిన్‌గా కయదు లోహర్ సెలక్ట్ అయింది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో శింబు సినిమాలో హీరోయిన్‌గా ఆమెకు ఛాన్స్ వరించింది. అధర్వ, జీవీ ప్రకాష్ కుమార్ వంటి యంగ్ హీరోల సరసన కూడా ఆమెనే హీరోయిన్. మొత్తంగా చూస్తే.. సౌత్‌లో టాప్ ఛైర్ కొన్నాళ్ల పాటు ఈ భామ కనుసన్నల్లో ఉండే అవకాశం అయితే లేకపోలేదు. కాకపోతే అది ఆమె సెలక్ట్ చేసుకునే సబ్జెక్ట్స్‌పై ఆధారపడి ఉంటుంది. చూద్దాం.. సౌత్ క్వీన్‌గా ఈ భామ మారుతుందో, లేదో. ప్రస్తుతానికైతే కుర్రాళ్లలో ఈ భామ క్రేజ్‌కు స్కై ఈజ్ ద లిమిట్.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!