Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో మెగాస్టార్ మనకి ఎలాగో హిందీలో సల్మాన్ ఖాన్ కూడా అంతే. ఎన్నో హిట్ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబందం లేకుండా తన ఫ్యాన్స్ కోసం మూవీస్ చేస్తుంటాడు. ఇటీవలే సికిందర్ మూవీ తో మన ముందుకు వచ్చాడు కానీ ఆశించిన ఫలితం అయితే అందుకోలేక పోయింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కు జోడీగా పూజ హెగ్డే నటించింది. ఈ చిత్రం విఫలమవ్వడంతో మరో సినిమా చేయడానికి కాస్త సమయం తీసుకునీ మంచి కథతో మన ముందుకు వస్తారని సినీ వర్గాల వారు చెబుతున్నారు. అయితే, తాను బ్రహ్మచారిగా మిగిలిపోవడానికి అసలు కారణమేంటో తెలిసింది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Hero Nani: హీరో నానితో ఉన్న ఈ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
సల్మాన్ ఖాన్ బ్రహ్మచారిగా మిగిలిపోవడానికి ఒక హీరోయిన్ కారణమనీ అతనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నటి జుహీ చావ్లాని ప్రేమించా… పెళ్లి కూడా చేసుకుందామనుకున్నా.. అయితే, ఇదే విషయాన్ని ఆమె తండ్రితో వెళ్లి చెబితే, ఆయన నన్ను ఒప్పుకోలేదు.
Also Read: Gold Rate Today : గోల్డ్ లవర్స్ కి బంగారం లాంటి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన రేట్స్
ఆయన అంచనాలకు తగ్గట్టు నేను లేనేమో అనుకున్నా.. అందుకే ఆమె కూడా ఏం ఆలోచించకుండా నన్ను రిజెక్ట్ చేసింది. పెళ్లి చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని చాలా కలలు కన్నాను. కానీ, అవన్ని మధ్యలోనే ఆగిపోయాయి. జుహీ చావ్లా నాతో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో సింగిల్ గా ఉంటున్నానని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.. ఆమె మాత్రం జై మెహతా ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందంటూ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.