Hero Nani: నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన హిట్ 3 చిత్రం మే 1 న రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే, ఈ మూవీ రూ. 100 కోట్లు గ్రాస్ వసూలు చేసి రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. దీనికి సంబందించిన పోస్ట్ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిచింది. ఈ చిత్రం తక్కువ సమయంలో రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరడంతో మూవీ టీమ్ సక్సెస్ ఈవెంట్ కూడా పెట్టింది.
Also Read: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలకు తగిన ఏర్పాట్లు లేవు.. అధికారులపై పుట్ట మధు ఫైర్!
అయితే, ఈ చిత్రంలో నాని ఇంత వరకు చేయని పాత్ర చేసి .. వైలెంట్ గా కూడా దుమ్ము లేపాడు. కాగా, ఈ చిత్రం కోసం నాని చాలా బాగా కష్టపడ్డాడు. అయితే, తాజాగా హీరో అడవి శేషుకి హిట్ 3 కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇద్దరూ షూట్ లో ఉన్నప్పుడు దిగినట్టు ఉన్నారు. పైగా, ఈ ఫోటోలను హీరోయిన్ శ్రీనిధి శెట్టి తీసింది. దీనికి సంబందించిన ఫోటోల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Shrasti verma: తప్పు లేకపోతే నిరూపించు.. జానీ మాస్టర్ కి ఓపెన్ ఛాలెంజ్ చేసిన శ్రేష్టి వర్మ
ఇటీవలే, శైలేష్ కొలను తన సోషల్ మీడియాలో నాని తలకు గాయమైన ఫోటోలను షేర్ చేశాడు. నాని ఓ సీన్ లో కొంతమందిని కొడుతూ ఉండగా.. అప్పుడు, సడెన్ గా కెమెరా నాని తలకు గట్టిగా తగలడంతో రక్తం వచ్చింది. దానికి సంబంధించిన షూట్ విజువల్స్ ని డైరెక్టర్ శైలేష్ కొలను ట్విట్టర్ లో షేర్ చేశాడు. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.