Aarti Ravi Post on Jayam Ravi Relation
ఎంటర్‌టైన్మెంట్

Aarti Ravi: పబ్లిగ్గా సింగర్‌తో జయం రవి హల్చల్.. భార్య ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Aarti Ravi: జయం రవి పేరు అందరికీ పరిచయమే. కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌కు కూడా ఆయన బాగా పరిచయస్తుడు. తమిళ్‌లోనే కాకుండా తెలుగులోనూ ఆయన సినిమాలు విడుదలై, మంచి సక్సెస్ అవుతుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలుగులోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. మొదటి నుంచి ఆ ఫ్యామిలీ తెలుగు ప్రేక్షకులతో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో జయం రవి (Jayam Ravi) పేరు ఏ విధంగా వైరల్ అయిందో తెలియంది కాదు. భార్యకు విడాకులు ఇచ్చి, ఓ సింగర్‌తో ఆయన రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడనేలా టాక్ నడిచింది. కానీ, కొందరు ఈ వార్తలను కొట్టిపడేశారు. ఆఖరికి జయం రవి కూడా ఆ వార్తల్లో నిజం లేదని వెల్లడించాడు. ఆయన భార్య ఆర్తి రవి మాత్రం, మౌనంగా ఉండిపోయారు. ఆమె మౌనం అనేక అనుమానాలకు తావిచ్చినా, స్వయంగా జయం రవి చెప్పడంతో, విడాకుల వార్త నిజం కాదని అనుకున్నారు.

Also Read- Trivikram Srinivas: త్రివిక్రమ్ తదుపరి హీరో ఎవరో తెలిసిందోచ్..

కానీ ఇప్పుడదే నిజమైంది. నిజంగానే జయం రవి తన భార్యని వదిలి వేరొకరితో రిలేషన్‌లో ఉన్నారు. తాజాగా ఆ విషయం పబ్లిగ్గా అందరికీ తెలిసిపోయింది. కోలీవుడ్ నిర్మాత ఇషారీ గణేష్ కుమార్తె పెళ్లికి జయం రవి తన భార్యతో కాకుండా, ఇప్పటి వరకు వినిపిస్తున్న సింగర్ కెన్నీషాతో హాజరై.. పక్కపక్కన కూర్చుని కనిపించారు. తమని పలకరించడానికి వచ్చిన వారందరినీ ఇద్దరూ కలిసి పలకరించడం, మళ్లీ ఇద్దరూ కలిసి ఒకేసారి కూర్చోవడం వంటి వాటితో పాటు, ఇద్దరూ కొత్తగా పెళ్లైన నూతన దంపతుల్లా ఈ వేడుకలో హల్‌చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన జయం రవి భార్య ఆర్తి రవి ఎమోషనల్ అవుతూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది. ఒక తల్లిగా ఆమె ఆలోచిస్తున్న విధానం అందరి మనసుని కదిలిస్తోంది.

">

నిజంగా జయం రవి, ఆర్తి రవిల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, దాదాపు 18 సంవత్సరాల పాటు కలిసున్న వారు విడిపోవడం అంటే తట్టుకునే విషయం కాదు. అందులోనూ పిల్లలు వయసుకు వచ్చి ఉన్నారు. వాళ్ల భవిష్యత్ ఏమిటి? అనే ఆమె ఆలోచిస్తూ చేసిన ఈ పోస్ట్ నిజంగానే హార్ట్ టచ్చింగ్‌గా ఉంది. ‘‘నేను ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే, నాకు ఇవన్నీ ముఖ్యం కాదు.. నాకు నా బిడ్డల ప్రశాంతత ముఖ్యం. ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయినా భరిస్తూ వచ్చాను. నేనేం మాట్లాడలేదంటే.. నా వైపు తప్పు ఉందని కాదు. ఈ రోజు వారిద్దరినీ ప్రపంచమే చూసింది. మా విడాకులకు సంబంధించి ఇంకా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఈ లోపు వాళ్లు ఇలా తెగించారు. దాదాపు 18 ఏళ్ల పాటు తోడుగా ఉన్న వ్యక్తి, అన్నింటిని వదిలేసి, తన దారి తను చూసుకున్నాడు. ఆయన నుంచి ఇప్పటి వరకు నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. పిల్లలను కూడా నేనే చూసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా ఇంటి విషయంలో బ్యాంక్ సమస్య. అయినా ఇప్పటి వరకు ప్రేమకే విలువ ఇస్తూ వచ్చాను.

Also Read- Balakrishna: వాళ్లని గదిలోకి తీసుకెళ్లి బాలయ్య ఏం చేసేవాడంటే.. దర్శకుడు షాకింగ్ కామెంట్స్!

ప్రేమ, పెళ్లి వంటి వాటి గురించి నేనేం బాధపడటం లేదు. కాకపోతే నా ఇద్దరు పిల్లలు భద్రత గురించే నా ఆందోళన. వారి వయసు ఇప్పుడు 10, 14 సంవత్సరాలు. చట్టపరమైన అంశాలు వారికి తెలియకపోయినా, బయట ఏం జరుగుతుందో వారికి తెలియకుండా ఉండదు. ఇప్పుడిప్పుడే వాళ్లకి అన్నీ అర్థం అవుతున్నాయి. ఈరోజు నేను భార్యగానో, అన్యాయానికి గురైన మహిళగానో మాట్లాడటం లేదు.. నా బిడ్డల శ్రేయస్సు, వారి భవిష్యత్ ఏంటనే ఆందోళనతో ఒక తల్లిగా ఇలా మాట్లాడుతున్నాను. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, మీటింగ్స్‌కు రారు, మెసేజ్ చేస్తే రిప్లయ్ ఇవ్వరు.. ఇలా ఇంకా ఇంకా గాయపరుస్తూనే ఉన్నారు. మీరు ఎన్ని చేసినా నిజాన్ని మార్చలేరు. తండ్రి అంటే బాధ్యత.. ఇంకా ఈ విషయంలో నేను మాట్లాడకపోతే నా బిడ్డలకు భవిష్యత్ లేనట్టే. నేనేం ఏడ్వడం లేదు, అరిచి గోల గోల చేయడం లేదు. నిన్ను నాన్న అని పిలుస్తున్న బిడ్డల కోసమే నిలబడ్డాను. విడాకులు మంజూరై కోర్టు తీర్పు వచ్చే వరకు నా పేరు పక్కన రవి పోదు.. ’’ అని ఆర్తి రవి చేసిన ఎమోషనల్ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి కూడా మద్దతు లభిస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్