Balakrishna: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పై ఓ దర్శకుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. షూటింగ్ లొకేషన్స్‌లో బాలయ్య బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుపుతూ ఆయన చేసిన కామెంట్స్.. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నిజంగా బాలయ్యని అంత మాట అంటాడని ఎవరూ ఊహించి ఉండరు. ఆయనని ఒక సైకో అంటూ సదరు దర్శకుడు చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. అసలింతకీ ఎవరా దర్శకుడు? ఎందుకు బాలయ్యని టార్గెట్ చేశాడు? ఆయనతో సైకో అనిపించుకోవాల్సినంతగా బాలయ్య ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే పూర్తి వార్త చదవాల్సిందే.
Also Read- Bhairavam: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ల ‘భైరవం’ రిలీజ్ డేట్ ఫిక్స్
‘కీచు రాళ్లు, కోకిల, కాఫీ బార్’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ అందరికీ కాకపోయినా, కొందరికైనా పరిచయం ఉండే ఉంటుంది. ఈ మధ్య టీవీ ప్రోగ్రామ్స్, యూట్యూబ్ ఇంటర్వ్యూలలో ఎక్కువగా కనిపిస్తున్న గీతా కృష్ణ (Geetha Krishna).. నందమూరి నటసింహం బాలయ్యపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బాలయ్యని ఒక సైకోగా ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల పద్మ భూషణ్ అందుకున్న బాలయ్యపై దర్శకుడు గీతా కృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నందమూరి అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ గీతా కృష్ణ బాలయ్య గురించి ఏం చెప్పారంటే..

‘‘నేను కె. విశ్వనాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో, ‘జననీ జన్మభూమి’ అనే సినిమాలో బాలకృష్ణ నటించారు. అప్పుడు ఆయన చాలా బాగుండేవారు. అందరినీ చక్కగా పలకరించేవారు. నాతో కూడా ఆయన చక్కగా సంభాషించేవారు. కానీ ఇప్పుడు బాలయ్యలో చాలా మార్పు వచ్చింది. ఆయన మెంటాలిటీ మారిపోయింది. ఇంకా చెప్పాలంటే, ప్రస్తుతం ఆయనొక సైకోలా బిహేవ్ చేస్తున్నారు. ఇది నేను చెప్పే మాట కాదు.. చాలా మంది చెబుతున్నమాట. పబ్లిక్‌కి కూడా తెలుసు. షూటింగ్ లొకేషన్‌లో ఎవరైనా బాలయ్యని చూసి నవ్వితే చాలు.. వాళ్లకి ఆ రోజు మూడిందే. ఆ నవ్విన వాళ్లని తన గదిలోకి పిలిపించుకుని మరీ కొడతాడు. అలా మారిపోయాడు బాలకృష్ణ. ఆయన మెంటాలిటీనే అలా మారిపోయింది’’ అని గీతా కృష్ణ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్తలు దుమారాన్ని రేపుతున్నాయి.
Also Read- Pawan Kalyan: అవ్వ అంతులేని అభిమానం.. పవన్ కళ్యాణ్ జీవితంలో మరిచిపోరేమో..
నందమూరి బాలకృష్ణకు కోట్లలో అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ మూల స్థంబాలలో ఒకరుగా, దాదాపు నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నందమూరి నటసింహాన్ని పట్టుకుని సైకో అనడంపై ఆయన అభిమానులు కోపోద్రిక్తులవుతున్నారు. పైసాకి పనికిరాని వారంతా, ఇలా ఇంటర్వ్యూలలో సొల్లు కబుర్లు చెప్పుకుని కాలం వెల్లదీస్తున్నారంటూ స్ట్రాంగ్‌గానే గీతా కృష్ణకు కౌంటర్స్ వేస్తున్నారు. ఇక బాలయ్య విషయానికి వస్తే.. హిందూపురంలో హ్యాట్రిక్ విజయాలతో ఎమ్మెల్యేగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన బాలయ్య, ఇటు సినిమా పరంగా కూడా వరుస సక్సెస్‌లతో దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా బోయపాటి రూపొందిస్తున్న ‘అఖండ 2’ చిత్రీకరణలో ఆయన పాల్గొంటున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు