Operation Sindoor( image credit: twitter)
తెలంగాణ

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ కు పూర్తి మద్దతు.. దేశ భద్రతపై అందరిని కేంద్రం కలుపుకుపోవాలి!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావాలని రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలని మంత్రి కొండా సురేఖ దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు.  అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇలాంటి అత్యవసర సమయంలో భారత ఆర్మీకి మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” రెండో దాడి విజయవంతం కావడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఆర్మీ బలగాలు సరిహద్దులో పోరాడుతున్న సమయంలో వారి క్షేమం కోరి మనమంతా పూజలు చేయడం సందర్భాచితం అన్నారు.

 Also Read: Indiramma Houses: జర్నలిస్టుల సంక్షేమం కోసం.. కొత్త ఆర్థిక సహాయం!

తీవ్రవాదాన్ని యావ‌త్ భార‌త‌మంతా ఉక్కు పిడికిలితో ఎదుర్కొన్న‌దన్నారు. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా క‌ఠినంగా వ్య‌వ‌హరించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ మంత్రిగా కాదు.. దేశ పౌరురాలిగా, ఆపరేషన్ సిందూర్ పై హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు. దేశ భ‌ద్ర‌త విష‌యంలో అంద‌రినీ క‌లుపుకోవాలనికేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేశ భద్రతపై కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రాజ‌కీయం చేయదన్నారు. మేము భారత ఆర్మీకి పూర్తి మద్దతుగా ఉన్నామన్నారు. రానున్న రోజుల్లో కూడా ఉంటామని స్పష్టం చేశారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ