Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఏర్పాట్లు తుదిశకు చేరాయి. సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు అధికారికంగా ప్రారంభమవుతున్నాయి. ఎయిర్ పోర్టుతో సహా హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పటికే 95 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీ దారులు హైదరాబాద్ చేరుకున్నారు.
మరికొంత మంది ప్రతినిధులు వివిధ దేశాల నుంచి శుక్రవారం కూడా వస్తారని మిస్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు. వీరికి తోడు 28 మంది మిస్ వరల్డ్ సంస్థ నుంచి నిర్వహణ ప్రతినిధులు, 17 మంది సహాయకులు వచ్చారు. గత వారం రోజులుగా వస్తున్నఅతిధులు అందరినీ తెలంగాణ సంసృతీ, సాంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పలుకుతూ వారికి బస ఏర్పాట్లను టూరిజం శాఖ కల్పించింది. విదేశీ ప్రతినిధులు బస చేసిన ట్రిడెంట్ హోటల్ దగ్గర పోలీసులు భారీ భద్రత కల్పించారు.
తెలంగాణకు తప్పకుండా రండి.. పర్యటించండి
అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన పోటీదారులు గురువారం రిహార్సల్స్ నిర్వహించారు. శుక్రవారం కూడా ఈ కంటెస్టంట్లు రిహార్సల్స్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీదారులను వివిధ గ్రూపులుగా ఏర్పాటు చేసి వారు పాల్గొనబోయే కార్యక్రమాల బ్రీఫింగ్ నిర్వాహకులు చేస్తున్నారు. కంటెస్టంట్లు విభిన్న కార్యక్రమాలు, తెలంగాణలో ఉన్న చారిత్రక, పర్యాటక ప్రదేశాల సందర్శనలో పాల్గొంటారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ, మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా మిస్ వరల్డ్ కంటెస్ట్ లో భాగంగా చేపడుతున్నారు.
Also Read: Operation Sindoor: బిగ్ బ్రేకింగ్.. ఆపరేషన్ సింధూర్ 2.0.. రెండోరోజు పాక్‌కు చుక్కలు
తెలంగాణలో ప్రకృతి, పర్యావరణ పరంగా అన్నిహంగులు ఉన్నా కొంత వెనుకబడింది. ఇకపై తెలంగాణ జరూర్ ఆనా ( తెలంగాణకు తప్పకుండా రండి.. పర్యటించండి) అనే నినాదాన్ని విస్తృతంగా ప్రపంచవ్యాప్తం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులకు పెరగటం, పెట్టుబడుల సాధన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఈవెంట్ గురించి దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రధాన ఏర్పోర్ పోర్టుల్లో, విదేశాల్లోని ఎయిర్ పోర్టుల్లో పోటీలకు సంబంధించిన ప్రచారం కల్పిస్తున్నారు.
వివిధ ప్రాంతాల్లో ఈ నెలాఖరు వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని పరిమిత సంఖ్యలో ప్రజలకు ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించనున్నారు. అందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టూరిజం వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకున్న వారికి 5 కేంద్రాల్లో వేయి మందికి చొప్పున మొత్తం 5వేల మందికి మిస్ వరల్డ్ పోటీలను వీక్షించే అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ పోటీలతో తెలంగాణ ఖ్యాతి పెరగనుంది.
Also Read: Indian Soldier: సైన్యానికి రైల్వే కష్టాలు.. సీట్ల కోసం పడిగాపులు.. పట్టించుకోండి!