Kesineni Nani: కేశినేని బ్రదర్స్ (Kesineni Brothers) మధ్య రోజురోజుకూ విమర్శలు, ప్రత్యారోపణలు అంతకుమించి సవాళ్లు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో విజయవాడ ఎంపీ, తన సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్నీ)కి సత్సంబంధాలు ఉన్నాయని నాని బాంబ్ పేల్చారు. అంతేకాదు దీనిపై సుదీర్ఘ విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతూ సీఎం చంద్రబాబుకు (CM Chandrababu) లేఖ రాశారు. అయితే కొన్ని రోజుల వ్యవధిలో కేశినేని చిన్ని స్పందిస్తూ అన్న నానిపై తీవ్ర ఆరోపణలు, అంతకుమించి విమర్శలు చేశారు. ఇవన్నీ ఒకెత్తయితే సోదరుడిని పాలేరు అంటూ సంబోంధిచారు కూడా. దీంతో కోపం నషాళానికి ఎక్కిందేమో కానీ, నాని (Kesineni Nani) మరోసారి సంచలన లేఖను చంద్రబాబుకు రాశారు. ఇందులో నివ్వెరపోయే విషయాలను ప్రస్తావించారు.
నా ఆందోళన అంతా ఇదే..
‘ గత ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3600 కోట్ల మద్యం కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తుపై నేను తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. ఈ కేసు విషయంలో విజయవాడ ఎంపీ, తెలుగుదేశం నేత కేశినేని శివనాథ్ (చిన్నీ) తాను, మీరు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)పై నమ్మకం లేదని పేర్కొంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)ను దర్యాప్తుకు కోరుతూ అధికారికంగా లేఖ రాశారు. ఇక దీనికి మరింత సంభ్రాంతి కలిగించేదిగా, ఇదే ఎంపీకి మద్యం కుంభకోణానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో భాగస్వామ్యం ఉన్నట్టు, ఆయన సన్నిహితుడైన రాజ్ కాసిరెడ్డి ద్వారా ఈ లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. వీటిని పలు మీడియా నివేదికలు, విశ్లేషకుల సమాచారాలు వెలుగులోకి తీసుకొచ్చాయి. ఒకవైపు ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే సీబీఐ దర్యాప్తును కోరడం, మరోవైపు ఆయననే సిట్‌పై అనుమానం వ్యక్తం చేయడం తీవ్ర అసమంజసతను, అలాగే ప్రస్తుత దర్యాప్తుపై ప్రజల్లో నమ్మకాన్ని తప్పక ప్రభావితం చేస్తోంది’ అని కేశినేని సంచలన విషయాలను వెల్లడించారు.
బాబుపై నమ్మకం ఉంది..
‘ ఇలాంటి రాజకీయ, పరిపాలనా జోక్యం వచ్చే అవకాశం ఉన్న కీలక అంశంలో, మీ పార్టీకి చెందిన ఎంపీ స్వయంగా పాత్రధారి, ఫిర్యాదుదారుగా ఉన్న నేపథ్యంలో నిజాయితీగా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే ఈ కేసును తక్షణం సీబీఐ, ఎన్‍ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు బదిలీ చేయడం అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తి పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలనే కావాలి. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ, మీరు (సీఎం చంద్రబాబు) తగిన చర్యలు తీసుకుంటారని నమ్మకంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నాను’ అని సీఎం చంద్రబాబుకు కేశినేని నాని సంచలన లేఖ రాశారు. ఇప్పటికే ఒకసారి సమగ్ర విచారణ కోరుతూ లేఖ రాయగా, తాజాగా మరోసారి నాని లేఖ రాశారు. ఇప్పటి వరకూ స్పందించని ముఖ్యమంత్రి.. తాజా లేఖపై అయినా స్పందిస్తారో వేచి చూడాలి మరి.
Read Also-Kesineni Nani: చిన్నిపై ‘లిక్కర్’ బాంబ్ పేల్చిన కేశినేని నాని.. సీఎం చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటో?
అవును నిజమే..!
కాగా, ఇవాళ ఉదయమే నాని ఆరోపణలపై ఎంపీ చిన్నీ మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చుకున్నారు. ‘ అవును.. రాజ్ కసిరెడ్డితో నాకు పరిచయం ఉంది. నాలుగుసార్లు ఆయన్ను కలిశాను. మేమిద్దరం కలిసి ఒక కంపెనీ కూడా పెట్టాం. దాన్ని డెవలప్మెంట్ చేద్దామని అనుకున్నాం. ఆ కంపెనీ డెవలప్మెంట్‌తో సహా ఆరు నెలలపాటు అన్నీ ఖర్చులు నేనే పెట్టాను. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో రాజ్ కసిరెడ్డికి సాన్నిహిత్యం, అతని వ్యవహారాలు చూసి నేను ఆ కంపెనీలో పెట్టిన పెట్టుబడులు కూడా వదిలేసి దూరంగా ఉంటున్నాను. వైఎస్ జగన్ దగ్గర కేశినేని నాని పాలేరుగా మారి నాపై ఆరోపణలు చేస్తున్నారు. నాపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు నేను సిద్ధంగానే ఉన్నాను. నాపై వస్తున్న ఆరోపణలపై విచారణకు సీబీఐకి లేఖ రాస్తున్నాను. రూ.3600 కోట్లు దోచేసిన జగన్ రెడ్డి కూడా సీబీఐ విచారణకు సిద్ధమా? కేశినేని నాని, జగన్‌కు 24 గంటలు సమయం ఇస్తున్నాను. ఆ ఆరోపణలను నిజమే అని నిరూపించాలి’ అని కేశినేని చిన్ని సవాల్ విసిరారు. ఇందుకు ప్రతిస్పందనగా కేశినేని నాని పై విధంగా రియాక్ట్ అయ్యారు.
Respected @ncbn garu,
I am writing to express serious concern over the ongoing investigation into the massive liquor scam, reportedly involving around Rs. 3600 crores during the previous regime. What is deeply troubling is that Kesineni Sivanath (Chinni) @KesineniS the sitting… pic.twitter.com/UdWxDw0CLj— Kesineni Nani (@kesineni_nani) May 8, 2025