TG Farmers: అరకత్తెరలో పోకలా తయారైంది వరి రైతుల పరిస్థితి. ఒక వైపు ఆకాల వర్షాలు భయపెడుతున్నాయి. మరోవైపు తూకాలు, తరలింపు వేగం పుంజుకోవడంలేదు. మరో పక్క తడిసిన ధాన్యం కొనేందుకు మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ధాన్యం కాపాడుకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో తగిన వసతులు లేవు.. ఇలా ఎటూ చూసిన అన్ని సమస్యలు చుట్టుముట్టి ఆరుగాలం కష్టపడి పండించిన అన్నదాతలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.
రైతులకు కలుగకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా తూకాలు మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో ఏ ధాన్యం కొనుగోలు కేంద్రంలో చూసిన రోజుల తరబడి ధాన్యం రాశులు దర్శనం ఇస్తున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం..
వానలు తడుపుతున్నాయి.. మిల్లరు కొర్రీలు పెడుతున్నారు..
ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కోసం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఆధారపడితే అక్కడ సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు సమస్యకు వేధిస్తుంటే మరోవైపు అకాల వర్షాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదే అదునుగా తడిసిన ధాన్యం తీసుకునేందుకు రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందుల పాలు చేస్తూ ధాన్యం కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
Also read: Mallikarjun Kharge: ఆపరేషన్ సింధూర్ పై.. జాతీయ కాంగ్రెస్ రియాక్షన్ ఇదే!
ఒక్కో క్వింటాలుకు తడి తరుగు, తాలు పేరుతో 10 నుంచి 12 కిలోల వరకు కోత విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మిల్లులపై అధికారుల నియంత్రణ కరువు అవడంతో తడిసిన ధాన్యం కూడ రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయింది.
చివరి దశకు చేరిన వరి కోతలు… ముందుకు సాగని తూకాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి కోతలు చివరి దశకు చేరుకున్నాయి. ధాన్యం నిలువలు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన మేరకు వసతులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. సరిపడ పరదాలు, తార్పలియన్లు లేక, కొనుగోలు కేంద్రాల్లో సరైన రక్షణ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలలో సరిపడా జాగా లేక రోడ్ల వెంట రైతులు ధాన్యం ఆరోబోసుకున్నారు.
హనుమకొండ జిల్లాలో 1.57 లక్షల మెట్రిక్ టన్నుల ధ్యానం వస్తుందని అధికారులు అంచనా వేశారు. వరంగల్ జిల్లాలో 2.57 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం, ములుగు జిల్లాలో 92.113 వేల మెట్రిక్ టన్నుల ధ్యానం, మహబూబాబాద్ జిల్లాలో 1.79 లక్షల మెట్రిక్ టన్నుల ధ్యానం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ధ్యానం, జనగామ జిల్లాలో 2,35,954 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు.
వీటికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన అధికారులు తుకాలు, తరలింపుకు సరిపడ వసతులు కల్పించలేదు. దీంతో ధాన్యం నిలువలు పేరుకుపోయి రైతులు 20 రోజులకు పైబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్నారు.
మారని మిల్లర్ల తీరు
ఒక వైపు ప్రభుత్వం అనవరసరపు కోతలు విధించి రైతులను ఇబ్బంది పెట్టొద్దు అని ఆదేశాలు జారీ చేసిన మిల్లర్లు తమ తీరు మార్చుకోవడంలేదు. ధాన్యం కొనుగోళ్ల వివరాలు ట్యాబ్లో ఎంట్రీలు త్వరగా చేస్తేనే పేమెంట్లు వెంటనే జమవుతాయి. సెంటర్లలో కాంటాలు పూర్తి అయ్యాక మిల్లుకు బయలుదేరేలోపు ధాన్యం వివరాలు ఓపీఎంఎస్ ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలని అధికారులు ఆదేశిస్తున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై మిల్లర్లు ఒత్తిడి తెచ్చి తరుగు, తాలు, తేమ పేరుతో వేధిస్తూ బస్తాకు 41 కిలోలకు బదులు అదనంగా కోత విధిస్తున్నారు.
లేదంటే మిల్లులొ ధాన్యం దించుకునేందుకు ఇబ్బంది పెడుతున్నారు. మిల్లర్ల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రతీ రెండ మూడు సెంటర్లకు ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగిని ఇన్చార్జిగా పెట్టినప్పటికీ పరిస్థితిలో మారు రావడం లేదనీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్రైన్స్ పోర్ట్ చేసేది రైతులు.. బిల్లులు పంచుకునేది తలా కొంత
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పోటెత్తిన ధాన్యం నిల్వలకు సరిపడా లారీలను ట్రాన్స్పోర్టర్లు సమకూర్చకపోవడంతో వర్షాలకు భయపడిన రైతులు త్వరగా కాంటాలు కావాలని ట్రాక్టర్లు కిరాయికి తెచ్చుకొని ధాన్యాన్ని తరలిస్తున్నారు. రైతులు తరలించుకున్న ధాన్యానికి చెల్లించాల్సిన ట్రాన్స్పోర్ట్ డబ్బులను ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ సహా కేంద్రం నిర్వహణ వరకు ఉన్న అధికారులు రైతులకు పూర్తిస్థాయిలో చెల్లించకుండా తలాకొంత పంచుకు తింటున్నారు అనే విమర్శలు ఉన్నాయి.
Also read: Colonel Sophia Qureshi: ఎవరీ కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా.. ఈ ఇద్దరి ట్రాక్ రికార్డ్ చూస్తే…?
ధాన్యం తరలించిన రైతులకు ట్రక్‌షీట్ ఆధారంగా ప్రభుత్వం నిర్దేశించిన అమౌంట్ ని చెల్లించాల్సిన పలువురు ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు చెల్లించకుండా రైతులకు ప్రతిసారీ అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ధాన్యం తరలించుకున్న వారికి ట్రాన్స్ పోర్టు డబ్బులను నేరుగా మా ఖాతాలోనే వేయాలని రైతుల కోరుతున్నారు.
పడిగాపులు పడుతున్న పట్టించుకునే వారు లేరు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్న పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఒకవైపు వర్షం ఇబ్బంది పడుతున్న ధాన్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన సౌకర్యాలు కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేయలేదు. ధాన్యం తెలిసిందంటూ మిల్లర్లు ఇబ్బందుల పాలు చేస్తున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక క్వింటాలకు 12 కిలోల వరకు తాలు, తరుగు, తేమ పేరుతో కోత విధిస్తున్నారు.
ఒకవైపు వర్షం, మరోవైపు అధికారుల నిర్లక్ష్యం
ఒకవైపు అకాల వర్షాలు, ఈదురు గాలులు ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయి అనేకమంది ఇబ్బందులు పడ్డాం. ధాన్యం కాపాడుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కేంద్రాల్లో లేవు. మరొకవైపు తూకాలు వేగవంతం చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేసి మాకు ఇబ్బందులు లేకుండా చేయాలి.