Let's Tell The Looters To Mind With A Lok Sabha Vote
Politics, Top Stories

Telangana : బడుగుల అండ.. ఎవరి జెండా!

– అగ్రవర్ణ పార్టీలుగా ముద్రపడ్డ బీజేపీ, బీఆర్ఎస్
– బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్
– అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి అదే కారణం
– ఓటింగ్ సరళిని గమనిస్తే కాంగ్రెస్‌కి పట్టం కట్టిన బీసీలు
– మొదటినుంచీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న హస్తం
– అగ్రవర్ణాలకు పెద్దపీట వేస్తూ.. బీసీ సీఎం నినాదంతో వెళ్లిన బీజేపీని నమ్మని ఓటర్లు
– అదే దారిలో నడిచి ఓటమి పాలైన గులాబీ పార్టీ
– పార్లమెంట్ ఎన్నికలలోనూ ఇదే వ్యూహంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్

Congress Party For Backward Classes : స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా వెనుకబడ్డ కులాల వాళ్లు జెండాలు మోసేందుకే పరిమితం అవుతున్నారు. తరతరాలుగా పల్లకీలు మోసే బోయీలుగా వాళ్లు ఉండిపోవాల్సిందేనా? కానే కాదని అంటోంది కాంగ్రెస్. సామాజిక స్ఫూర్తితో బడుగులను అక్కున చేర్చుకుంటున్నామని చెబుతోంది. జవహర్ లాల్ నెహ్రూ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకూ పార్టీ ఎజెండా బలహీనులకు అండగా నిలబడటమేనని అంటోంది. నిజానికి, ఆది నుంచీ కాంగ్రెస్ వెనుకబడ్డ వారికే ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికలలో హస్తానికి ప్రజలు పట్టం కట్టడానికి ఇదీ ఓ కారణం. అలాగే, కర్ణాటకలోనూ పార్టీని గద్దె నెక్కించింది కూడా ఆ వెనుకబడ్డ వర్గమే. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మొదలైప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని దాదాపు చాలా వరకు సర్వేలు చెప్పాయి. అనుకున్న మేర కాకపోయినా మంచి పర్ఫార్మెన్స్ చేసిన పార్టీ చివరికి అధికారాన్ని కైవసం చేసుకుంది. 39 సీట్లతో రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్, మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ తమకు వచ్చిన ఓట్లు, సాధించిన సీట్లు, బెస్ట్ పర్ఫార్మెన్స్ నియోజకవర్గాలపై సమీక్షలు నిర్వహించగా, కీలక విషయాలు వెలుగుచూశాయి.

కాంగ్రెస్‌నే నమ్ముతున్న వెనుకబడ్డ వర్గాలు.. ఎందుకు?

ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా ఆధిపత్యం కోసం సామాజిక వర్గాల మధ్య కొంత వ్యత్యాసం కనిపిస్తూనే ఉంటుంది. వారి ఆకాంక్షల మేరకు కొందరు నాయకులు వారిలో నుంచే వస్తే.. మరి కొందరు ఇతర సామాజిక వర్గాలకు అండగా నిలబడతారు. అయితే, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ విషయాన్నే తేటతెల్లం చేశాయి. అందులో పోలైన ఓట్లను కులాలు, మతాల వారీగా విభజించి పరిశీలిస్తే ఆశ్చర్యంకరమైన విషయాలు తెలిశాయి. అగ్రవర్ణాల నుంచి దళితుల వరకు ఏఏ పార్టీని అక్కున చేర్చుకున్నారు. అందులో పార్టీలు ఎంత వరకు విజయం సాధించాయో పరిశీలిస్తే ఆశ్చర్యం కలగకమానదు.

కాంగ్రెస్ గెలుపులో ప్రధాన భూమిక వారిదే!

తెలంగాణలో దాదాపు కనుమరుగవుతుంది అనుకున్న కాంగ్రెస్, కర్ణాటక గెలుపుతో జవసత్వాలు నింపుకుంది. చివరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ, చాలా వరకు సర్వేలు 70 నుంచి 80 వరకు సీట్లు వస్తాయని అంచనావేసినా ఆ మేరకు రాలేకపోయాయి. ఇక కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఏ సామాజికవర్గం ముఖ్య భూమిక పోషించిందన్న చర్చ జరగగా, రెడ్డి వర్గం ఓట్లు 49 శాతం కాంగ్రెస్‌కు పడ్డాయి. రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న బీసీ ఉప కులాల ఓట్లను కూడా రాబట్టడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్, బీజేపీ వైపునకు వెళ్లకుండా ఒడిసిపట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించింది.. గౌడ, గొల్ల సామాజికవర్గానికి చెందిన ఓట్లను కూడా తన ఖాతాలో వేసుకుంది. లంబాడీ తండాలకు సంబంధించి గంపగుత్తగా ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లాయి.

బీఆర్ఎస్‌కు దూరమైన ఆ సామాజికవర్గం ఓట్లు

రెండు సార్లు ప్రభుత్వాన్ని నడిపి హ్యాట్రిక్ కోసం శక్తిమేర పోరాటం చేసిన బీఆర్ఎస్ వివిధ సామాజికవర్గాల ఓట్లను రాబట్టడంలో కొంత మేర విఫలమైంంది. తమ వైపునకు వస్తాయనుకున్న రెడ్డి ఓట్లు రాకుండా పోయాయి. దళిత బంధు కొంత మేరకు కలిసి వచ్చినా పెద్దగా తేడా కనిపించలేదు. దళితులు కూడా 3 శాతం కాంగ్రెస్ కంటే బీజేపీ వైపునకు మళ్లారు. ఇక ఎస్టీలు అయితే 10 శాతం మేర బీఆర్ఎస్‌ను ఆదరించారు. ఎంఐఎంతో పొత్తు కారణంగా ముస్లిం ఓట్లు కొంత మేర బీఆర్ఎస్ ఖాతాలోనే పడ్డాయి.

బీజేపీని దూరం పెట్టిన బీసీలు

రెండు పర్యాయాలు తెలంగాణను అగ్రవర్ణానికి చెందిన ముఖ్యమంత్రి నడిపాడు. దీంతో ఈ ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ దక్కించుకోవాలని బీజేపీ ‘బీసీ సీఎం’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లింది. కానీ, ఇది ఆ పార్టీకి ఏ మాత్రం కలిసి రాలేదు. కాంగ్రెస్‌కు ఎక్కువ శాతం ఓట్లు బీసీ వర్గాల నుంచే ఉన్నాయి. ఏది ఏమైనా కులాల వారీగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు పోలైన ఓట్లలో తక్కువ తేడా కనిపించినా బీజేపీ మాత్రం ఆమడదూరంలో ఉంది. రెండు ప్రధాన పార్టీల కంటే ఓట్లను రాబట్టడంలో కాంగ్రెస్ విజయం సాధించడంపై సర్వేల ఫలితాలు కూడా కారణం కావొచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తం అయింది. ఏది ఏమైనా ఈ సామాజికవర్గాల ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాలకు దగ్గరగా ఉందనేది వాస్తవం. బీజేపీ, బీఆర్ఎస్ అగ్రవర్ణాలకు పెద్దపీట వేసే పార్టీలుగా ముద్రపడడం, కాంగ్రెస్‌లో మొదట్నుంచి ఈ తరహా ధోరణి లేకపోవడం వల్లే జనం ఇటువైపు మొగ్గు చూపినట్టుగా చెబుతున్నారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో 12 నుంచి 14 సీట్లు గెలుచుకునే ఊపులో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ బడుగు, బలహీన వర్గాల ఓట్లే కీలకం కానున్నాయి. పైగా, ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఎన్నికల వాగ్దానాలు, రేవంత్ ఛరిష్మా, కేంద్రంలో బలపడుతున్న కాంగ్రెస్ అన్నీ వెరసి మళ్లీ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో విజయం తథ్యం అని హస్తం నేతలు బలంగా నమ్ముతున్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు