Operation Sindoor
ఎంటర్‌టైన్మెంట్

Operation Sindoor: సహనం.. సహనం ఎంతకాలం? మహా సేనా మీ వెన్నంటే మేము!

Operation Sindoor: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత్‌ (India) దీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైంది. మంగళవారం అర్ధరాత్రి ‘ఆపరేషన్‌ సింధూర్‌’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్‌లోని (Pakistan) ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేసిన మెరుపు దాడులను భారతీయులందరూ కొనియాడుతున్నారు. ప్రముఖులెందరో సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ.. మేమంతా మీ వెంటే ఉంటామంటూ భారత్‌ సైన్యాన్ని ఉద్దేశిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ చెప్పిన ‘మహా సేనా’ అంటూ ‘నా తల్లినీ, నా నేలనీ ఏ నీచుడూ నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తీసి చెప్పటానికి వెళ్తున్న ప్రతి సైనికుడికి సెల్యూట్ చేస్తున్నాం’ అంటూ ప్రతి ఒక్కరూ భారత్ సైన్యానికి అండగా నిలబడుతున్నారు. రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, ఆనంద్ మహీంద్రా వంటి ప్రముఖులందరూ సోషల్ మీడియా వేదికగా భారత్ సైన్యానికి మద్దతు తెలుపుతూ పోస్ట్‌లు చేశారు.

Also Read- shrasti verma: నన్ను కొట్టారు.. తప్పుగా ప్రవర్తించారు.. జానీ మాస్టర్ పై సంచలన కామెంట్స్ చేసిన శ్రేష్టి వర్మ

‘‘పోరాటం ఇప్పుడే మొదలైంది. లక్ష్యం పూర్తయ్యేవరకూ ఆగదు. దేశం మొత్తం మీతో ఉంది. జైహింద్‌’’ అంటూ రజనీకాంత్‌.. నరేంద్ర మోదీ, అమిత్‌షాలను ట్యాగ్ చేశారు.

‘ఆపరేషన్‌ సింధూర్’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ‘జైహింద్‌’ అని పోస్ట్ చేశారు.

‘‘దశాబ్దాలుగా సహనం.. సహనం! మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతం‌కి ‘ఆపరేషన్ సింధూర్’తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు.. మీ వెన్నంటే మేము. జైహింద్!’’ అని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోస్టర్ చేశారు.

‘ఇక్కడ న్యాయం యూనిఫాం ధరించి వస్తుందనే దానికి ఇది ఒక భయంకరమైన గుర్తు. మనం నిలబడేది ఈ భారత్ కోసమే. మేరా భారత్ మహాన్. మన యోధులకు వందనం!’ – మహేష్ బాబు

మన భారత్ సైన్యం యొక్క భద్రత, బలం కోసం ప్రార్థిస్తున్నాను.. జైహింద్ – జూనియర్ ఎన్టీఆర్

Also Read- Prabhas Marriage: వాళ్లని సీక్రెట్ గా కలిసిన ప్రభాస్.. పెళ్లి కోసమేనా.. గుడ్ న్యూస్ పక్కానా?

న్యాయం జరిగింది… జైహింద్‌‌- అల్లు అర్జున్‌

‘ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతోనే భారత్‌ ఈ చర్యలు చేపట్టింది. పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు. మన దేశం లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో చాలా సంయమనం పాటించింది. 26 మందిని దారుణంగా చంపినందుకు మాత్రమే ఈ చర్యలు. మేము ఎప్పుడూ నిబద్ధతకు కట్టుబడి ఉంటాం’ – ప్రకాశ్‌ రాజ్‌

‘ప్రజల భద్రత కోసం ప్రార్థిద్దాం. ఉగ్రవాదం, దాడులు అనే పదాలు లేకుండా.. ప్రజలందరూ ప్రశాంతమైన జీవితాలను గడిపే రోజు కోసం ఎదురుచూస్తున్నా. ప్రశాంతంగా, సుసంపన్నంగా అందరం జీవిద్దాం. జైహింద్‌’ – విజయ్‌ దేవరకొండ

ఇలా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే కాకుండా.. ప్రతి ఇండస్ట్రీ నుంచి భారత్ సైన్యానికి మద్దతు లభిస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!