Nandini Gupta: తెలంగాణ నాకు ఎంతో నచ్చిందని మిస్ ఇండియా నందిని గుప్తా పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీలపై హైటెక్ సిటీలోని ట్రిడెంట్ హోటల్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణకు గొప్ప చరిత్ర ఉందన్నారు. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తో ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న సిటీ హైదరాబాద్ అని పేర్కొన్నారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ నాకు ఎంతో నచ్చాయన్నారు.
యాంగస్ట్ స్టేట్ అయినా ఇక్కడ హాస్పటాలిటీ బాగుందన్నారు. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ నన్ను కట్టి పడేశాయన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి యువతి ఒక గొప్ప లక్ష్యంతో ముందడుగు వేస్తున్నారన్నారు. తెలంగాణ గురించి మాట్లాడిన ప్రతిసారి తనకు గొప్ప అనుభూతి కలుగుతుందని వెల్లడించారు. అందరికీ నమస్కారం తెలంగాణకు తప్పకుండా రండి అంటూ తెలుగులో మాట్లాడి అందరిని ఆకట్టుకుంది.
Also Read: India And Pak Tension: ఏ క్షణమైనా పాక్‌పై భారత్ దాడి.. ఈలోపే కీలక పరిణామం
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరుగడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఈ పోటీల కోసం వస్తున్న ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతిని పంచేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర సంప్రదాయం, పర్యాటక ప్రాముఖ్యతను ప్రంపంచానికి చాటేందుకు ఇది మంచి అవకాశం అన్నారు. నటుడు సోను పంకజ్ సూద్ మాట్లాడుతూ అందాల పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
పర్యాటకశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణ ఆహారం, సంస్కృతి, పర్యాటక శాఖను ప్రపంచానికి చాటేందుకు ఈ పోటీలు దోహదం చేయనున్నాయన్నారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈపోటీలో దోహదపడతాయన్నారు. ఈ సమావేశంలో మిస్ వరల్డ్ సీఈఓ జూలియా, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: DCP lavanya: మహిళలు.. మైనర్లకు వేధింపులు.. నిందితుల అరెస్ట్!