National Health Mission State: వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో త్వరలో నేషనల్ హెల్త్ మిషన్ స్టేట్ సెమినార్ జరగనున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయనున్నది. ఈ సెమినార్ కు రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో కొనసాగే వివిధ విభాగాల హెచ్ వోడీలు, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్లు, ఇతర కీలక ఎంప్లాయిస్ హాజరు కానున్నారు.
దాదాపు మూడు నుంచి ఐదు వేల మంది వరకు ఈ సెమినార్లో పాల్గొనే ఛాన్స్ ఉన్నదని ఉన్నతాధికారులు తెలిపారు. ఇటీవల నేషనల్ ఎన్ హెచ్ ఎమ్ సెమినార్ కూడా హైదరాబాద్ లో జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి హెల్త్ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు వచ్చి, తెలంగాణ స్టేట్ పాలసీపై అభినందనలు తెలిపారు.
ప్రధానంగా ఎన్ సీడీ స్క్రీనింగ్ పై ప్రశంసలు కురిపించారు. బీపీ, షుగర్, క్యాన్సర్ పేషెంట్లను వేగంగా గుర్తించేందుకు ఈ స్క్రీనింగ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇలాంటి మరిన్ని కొత్త ప్రోగ్రామ్ ల రూప కల్పన కోసమే ఈ స్టేట్ సెమినార్ నిర్వహించబోతున్నట్లు సెక్రటేరియట్ లోని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. ఇప్పటికే ఏర్పాట్లు ప్రిపేర్ అయ్యాయని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సెమినార్ నిర్వహిస్తామని ఆయన వివరించారు.
Also read: Hari Hara Veera Mallu: ఇక ఎవరూ ఆపలేరు.. ఈసారి వీరమల్లు రావడం పక్కా!
వరల్డ్ బ్యాంక్ నుంచి భారీగా నిధులు?
ఆరోగ్యశాఖ అభివృద్ధికి వరల్డ్ బ్యాంక్ నిధులు సహకరించనున్నాయి. దాదాపు రూ.4 వేల కోట్ల నిధులు వైద్యారోగ్యశాఖకు రానున్నాయి. వీటితో ఆసుపత్రుల ఇన్ ఫ్రాస్ట్రక్చర్, కొత్త హాస్పిటల్స్, పాత దవాఖాన్ల రెనోవేషన్, ట్రామ కేర్ సెంటర్లు, క్యాన్సర్ యూనిట్లు, క్షేత్రస్థాయిలోని పేషెంట్లకు వైద్యం సులువుగా అందేలా కొత్త ప్రాజెక్టులు, ప్రోగ్రామ్ లు, స్కీమ్ లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
అయితే అవి ఏ తరహాలో ఉండాలి? పనితీరు ఎలా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై ఇటీవల స్టేట్ కు వచ్చిన వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు.
ఇప్పుడు ఆయా వివరాలను ఈ స్టేట్ సెమినార్ లో అన్ని జిల్లాల అధికారులు, డాక్టర్లకు స్టేట్ ఆఫీసర్లు అవగాహన కల్పించనున్నారు. ఈ స్టేట్ కాన్ఫరెన్స్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ రూపు రేఖలను మార్చబోతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.