Ketika Sharma
ఎంటర్‌టైన్మెంట్

Ketika Sharma: ‘సింగిల్’.. రష్మికాను టార్గెట్ చేస్తున్న కేతిక, మ్యాటరిదే!

Ketika Sharma: కేతికా శర్మ.. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరే. చేతినిండా సినిమాలు లేనప్పటికీ తన అందాలతో, అవకాశాలను, ఐటం సాంగ్స్ పట్టేస్తున్న ఈ భామ, నిత్యం ఏదో రకంగా వార్తలలో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఆమె భారీ అందాల ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఎంతగా అందాలు ఉన్నా, అమ్మడికి అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఒక్క హిట్టు పడితే, తన అందాల విందుకు సరిపడా ఆనందాన్ని తను కూడా ఎంజాయ్ చేస్తుంది. ఏ హీరో తనకు హిట్ ఇస్తాడా? అని ఎంతగానో వేచి చూస్తున్న ఈ భామ.. ప్రస్తుతం కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణునే నమ్ముకుంది. తనైనా, తనకు హిట్ ఇస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకుంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా హీరోహీరోయిన్లుగా, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సింగిల్’. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, ఈ సినిమాను మే 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా హీరోయిన్ కేతికా శర్మ ఈ ‘సింగిల్’ విశేషాలను మీడియాతో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ..

Also Read- Samantha and Sobhita: సమంత ఇవ్వలేనిది.. చైతూకి శోభిత ఇస్తుందా? అక్కినేని మరో తరం దిగబోతుందా?

‘‘గీతా ఆర్ట్స్ సంస్థలో వర్క్ చేయాలని ఎప్పటినుంచో నా కోరిక. అల్లు అరవింద్ సార్ ఒక సినిమాని సమర్పిస్తున్నారంటే కచ్చితంగా ఆ సినిమాలో అద్భుతమైనటువంటి కంటెంట్ ఉంటుందని అర్థం. ‘సింగిల్’ సినిమా గురించి నాకు కాల్ రాగానే, అది గీతా ఆర్ట్స్‌లో అని తెలియగానే.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేశాను. ఆ తర్వాత కథ విన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఇది వెరీ ఫన్ ఫిల్డ్ మూవీ. పర్ఫెక్ట్ స్టార్ కాస్ట్‌తో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో నేను పూర్వా అనే పాత్రలో కనిపిస్తాను. తను వెరీ ఇండిపెండెంట్, చాలా ప్రాక్టికల‌్‌గా ఆలోచిస్తుంటుంది. ఈ కథలో ఎమోషన్ నా పాత్ర ద్వారానే వస్తుంది. కొన్ని సీరియస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. ఈ సినిమాలో ఉండే లవ్ స్టోరీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

శ్రీ విష్ణు వండర్‌ఫుల్ పర్సన్. చాలా సింపుల్‌గా, హంబుల్‌గా ఉంటారు. యాక్టింగ్‌లో కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆయన కామెడీ టైమింగ్ చాలా యూనిక్‌గా ఉంటుంది. ఆయన స్పాట్‌లో డైలాగ్స్ ఇంప్రవైజ్ చేసేస్తుంటారు. ఆయన నటన చాలా స్పాంటేనియస్‌గా ఉంటుంది. ఆయనతో వర్క్ చేయడం నిజంగా గొప్ప అనుభవంగా భావిస్తున్నాను. మరో హీరోయిన్‌గా చేసిన ఇవానా చాలా అందంగా ఉంటుంది. ఆన్ స్క్రీన్‌లో మా మధ్య అంతగా సీన్లు లేవు కానీ, ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం మేం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. చాలా పాజిటివ్ పర్సన్ తను. డైరెక్టర్ కార్తీక్ రాజు వెరీ ఫ్యాషనైట్ ఫిలిం మేకర్. క్లియర్ విజన్‌తో ఉంటారు. ఆయనకు ఏం కావాలో క్లారిటీ ఉంటుంది. సెట్లో అందర్నీ చాలా కంఫర్టబుల్‌గా చూసుకున్నారు.

Also Read- Jabardasth Tanmay: సూసైడ్ ఆలోచనలు వచ్చాయి.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అన్నారు.. జబర్దస్త్ తన్మయి

‘రాబిన్ హుడ్’ సినిమాలో ‘అదిదా సర్‌ప్రైజ్’ పాట వైరల్ కావడం చాలా సంతోషాన్నిచ్చింది. ‘సింగిల్’లో అలాంటి డ్యాన్సింగ్ నెంబర్ లేదు. ఇది అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిల్డ్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాను చూస్తున్నంత సేపూ మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. ప్రజంట్ నా కెరీర్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. గెలుపోటములనేవి మన చేతిలో ఉండవు. వర్క్ చేయడం ఒక్కటే మన చేతిలో ఉంటుంది. రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా నాకున్న అవకాశాలతోనే కెరీర్‌ని సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తుంటాను. నిజంగా ఒక నటిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తాను. ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో రష్మికా మందన్నా చేస్తున్న తరహా పాత్ర చేయాలనేది నా డ్రీమ్. ఇంకా సాయి పల్లవి, కీర్తి సురేష్ చేస్తున్న పెర్ఫార్మెన్మ్ ఓరియంటెడ్ పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగు, తమిళ్ బైలింగ్వల్ ఫిల్మ్ ఒకటి సెట్స్‌పై ఉంది. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ ఓకే చేశాను. త్వరలోనే మేకర్స్ ఆ వివరాలు తెలియజేస్తారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు