Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్లాడు. కానీ, హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది. హిట్ ఎప్పుడూ పడుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు ఆరేళ్లు ఎవరికి తెలియకుండా సైలెంట్ గా లవ్ చేసుకుని 2023లో పెద్దల సమక్షంలోపెళ్లి చేసుకున్నారు.
Also Read: Ponnam Prabhakar: ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధం.. మంత్రి ప్రకటన!
ప్రస్తుతం, ఇద్దరూ ఎవరీ సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత ఇద్దరికీ ఏ సినిమా తీసినా కూడా కలిసి రాలేదు. కానీ, ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు. పెళ్లి తర్వాత ఎన్నో ట్రిప్స్ కి ఇతర దేశాలకు వెళ్లారు. అలా వెళ్ళిన ట్రిప్స్ ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవాళ్ళు. మ్యారేజ్ అయి రెండేళ్ళు అవుతున్న ఇంకా గుడ్ న్యూస్ చెప్పలేదా అని చాలా మంది అడిగారు. దీని గురించి పలు ఇంటర్వ్యూల్లో కూడా అడిగారు. కానీ, ఎప్పటికప్పుడు స్కిప్ చేస్తూ ఉన్నారు. అలాగే, సినీ వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇక ఈ ఏడాదిలో కూడా చెప్పారమో అని అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటో మీరు కూడా తెలుసుకోండి.
Also Read: CM Revanth on BRS: బీఆర్ఎస్ పాలన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది.. సీఎం రేవంత్ రెడ్డి!
అయితే, గత కొంత కాలం నుంచి లావణ్య ప్రగ్నెంట్ అని వార్తలు చాలానే వచ్చాయి. తాజాగా వరుణ్, లావణ్య అందరికీ గుడ్ న్యూస్ చెబుతూ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. చిన్ని షూస్ తో పాటు వరుణ్, లావణ్య కలిసి చేతులు పట్టుకున్న ఫోటోని తమ సోషల్ మీడియాలో షేర్ చేసి.. మా జీవితం మరింత అందంగా మారబోతుంది అని ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటో షేర్ చేశారు.
Also Read: Kesineni Nani: చిన్నిపై ‘లిక్కర్’ బాంబ్ పేల్చిన కేశినేని నాని.. సీఎం చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటో?
దీంతో, లావణ్య ప్రగ్నెంట్ అనే వార్తలు నిజమయ్యాయి. మెగా ఫ్యాన్స్ తో పాటు అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. దీని పై రియాక్ట్ అయిన ఫ్యాన్స్, నెటిజన్లు, సెలబ్రిటీలు ఈ జోడీకి కంగ్రాట్స్ చెబుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.