Youtuber Anvesh: నా అన్వేషణ అన్వేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను ప్రస్తుతం, బెట్టింగ్ యాప్స్ పైన పోరాటం చేస్తున్నాడు. గత కొన్ని నెలల నుంచి బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసే వాళ్ళ వీడియోస్ పెడుతూ పాపులారిటీని సంపాదించుకున్నాడు. చిన్న సెలబ్రిటీల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవర్ని వదలకుండా అందరివి వీడియోస్ పెడుతున్నాడు. అయితే, రీసెంట్ గా బాలీవుడ్ నటీ నటుల పై కూడా పెద్ద బాంబ్ పేల్చాడు.
Also Read: Samantha and Sobhita: సమంత ఇవ్వలేనిది.. చైతూకి శోభిత ఇస్తుందా? అక్కినేని మరో తరం దిగబోతుందా?
అన్వేష్ పై కేసు?
ఇది మాత్రమే కాకుండా ఇటీవలే హైదరాబాద్ మెట్రో పై కూడా బెట్టింగ్ ఆరోపణలు చేశాడు. రూ. 300 కోట్లు బెట్టింగ్ యాప్స్ పై సంపాదించారంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఆధారాలు చూపించి మాట్లాడాలి కానీ తప్పుడు సమాచారం ఎలా చెబుతాడంటూ సైబర్ క్రైం పోలీసులు అన్వేష్ పై సుమోటోగా కేసు నమోదు చేశారు. అన్వేష్ చేసిన ఆరోపణల్లో ఎలాంటిన్ నిజం లేకపోతే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.
Also Read: Shrasti Verma : బిగ్ బ్రేకింగ్.. సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మపై కేసు నమోదు
అయితే, అన్వేష్‌పై చాలా మంది యూట్యూబర్లు కోపంతో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అన్వేష్ ఇండియాకి ఎప్పుడూ వస్తాడా అని ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్వేష్ కి సంబందించిన పాత వీడియో ఒకటి బయటకు రాగా, నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో అన్వేష్ ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, అన్వేష్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసాడంటూ వీడియో షేర్లు చేస్తున్నారు. ఆ వీడియోలో అన్వేష్ మాట్లాడుతూ.. ” అందరూ ఏదో చెబుతున్నారు అనుకుంటున్నారా.. అది నొక్కండి ఇది నొక్కండి అని.. అలా మీరు నొక్కినప్పుడు మాకు కమీషన్ వస్తుంది. అయితే, దానివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు. మేము ప్రమోట్ చేసినందుకు కొంచెం డబ్బు ఇస్తారు. ముందు ముందు ఇంకా ఎక్కువ ప్రమోషన్ వీడియోలు చేసే అవకాశం ఉంటుంది.’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
Also Read: స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.