YS Sharmila
Politics

AP News: షర్మిల ప్రచారంలో ‘సిద్ధం’ నినాదాలు.. భలే కౌంటర్ ఇచ్చారే!

YS Sharmila: వైఎస్ జగన్ అడ్డా కడపలో చెల్లి షర్మిల వైసీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అన్నను జగన్ గారు అంటూ మంటపెడుతున్నారు. వైఎస్ వివేకా ఘటనను తరుచూ ప్రస్తావిస్తూ షర్మిల, సునీతలు దాడికి దిగుతున్నారు. షర్మిల కడప లోక్ సభ నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆమె ఏపీ న్యాయ్ యాత్ర చేపడుతున్నారు. శుక్రవారం ఆమె ఆదోనిలో మాట్లాడారు. ఆమె వైసీపీపై విమర్శలు చేస్తున్న తరుణంలో అనూహ్య ఘటన జరిగింది.

షర్మిల ప్రసంగిస్తూ ఉండగా కొందరు వైసీపీ జెండాలు పట్టుకుని వచ్చారు. వైసీపీ జెండాలు చూపుతూ సిద్ధం.. సిద్ధం అంటూ నినాదాలు చేశారు. షర్మిలకు నేరుగా వైసీపీ జెండాలు చూపిస్తూ సిద్ధం అంటూ నినాదాలు చేయడంతో తర్వాత ఏం జరుగుతుందా? అని సభకు హాజరైన వారు చూశారు. వైఎస్ షర్మిల వెంటనే కుదురుకుని దేనికి సిద్ధం? అంటూ ఎదురుదాడికి దిగారు. ‘దేనికి సిద్ధం? మళ్లీ బీజేపీకి గులాంగిరి చేయడానికి సిద్ధమా? మళ్లీ బీజేపీకి లొంగిపోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్లీ 11 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్లీ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి సిద్ధమా? మళ్లీ ఇంకో దగా డీఎస్సీ ఇవ్వడానికి సిద్ధమా? రైతులను మళ్లీ ముంచడానికి సిద్ధమా? మద్యపానం నిషేధం అన్నారే.. మళ్లీ మహిళలను ముంచడానికి సిద్ధమా? దేనికి సిద్ధం అన్నా?’ అని కౌంటర్ ఇచ్చారు.

Also Read: కాంగ్రెస్.. సెక్యులర్ పార్టీ, ప్రూఫ్ కావాలా?

మేము కూడా సిద్ధం. వైసీపీని గద్దె దించడానికి సిద్ధం. వైసీపీని గద్దె దించడానికి మేమంతా సిద్ధం. ఏమన్నా సిద్ధమా? వైసీపీ అధికారంలోకి దిగిపోవాలి. సిద్ధమా? ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా జగన్ మోహన్ రెడ్డిగారు? అంటూ మళ్లీ వైసీపీపై విమర్శలతో దాడికి దిగారు.

సిద్ధం అనే నినాదాన్ని వైఎస్ జగన్ పార్టీ వైసీపీ ఇచ్చింది. సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు. ఆ తర్వాత మేమంతా సిద్ధం అనే పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిలకు వ్యతిరేకంగా సిద్ధం అనే నినాదాలు చేశారు.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు