Mahesh Kumar Goud: ప్రజాసేవ చేసేందుకు మన్మోహన్ సింగ్ ఫెలో షిప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కొత్త తరం రాజకీయ నాయకులకు స్థిరత్వం ఏర్పడటంతో తోడ్పాటు అందిస్తుందన్నారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ బృహత్తర కార్యక్రమమైన ఫెలో షిప్ లాంఛ్ చేయడం శుభ పరిణామమని చెప్పారు.
Also Read: Ex MLA Putta Madhukar: కాళేశ్వరం పై అసత్య ప్రచారం బాధాకరం.. మాజీ ప్రజా ప్రతినిధులు!
ప్రొఫెషనల్ గా స్థిరపడిన తర్వాత రాజకీయాల్లో రావాలనుకునే వారికిలొ షిప్ కార్యక్రమం ఓ మంచి అవకాశంగా భావిస్తున్నానని వివరించారు. టీపీసీసీ తరఫున డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలో షిప్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఏఐపీసీ నాయకుల్ని అభినందిస్తున్నా నని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ప్రోద్బలంతోనే మన్మోహన్ సింగ్ రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన పేరు మీద ఇలాంటి ప్రోగ్రామ్ నిర్వహించడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల సంక్షేమంపై నే ఎక్కువ ఫోకస్ ఉంటుందని పీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు