MLA Adi Srinivas: ఉద్యోగం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అమాయకపు యువత మోసపోతున్న సంగతి తెలిసిందే. ఆకర్షణీయమైన జీతంతో పాటు మంచి హోదా ఉన్న ఉద్యోగం ఇప్పిస్తామంటూ పలు ఏజెన్సీలు వారిని మోసం చేస్తున్నాయి. ఎప్పుడు సామాన్యులను మాత్రమే టార్గెట్ చేసే ఈ ముఠా.. ఈ సారి ఏకంగా ఓ ఎమ్మెల్యేను తమ ఉచ్చులో దింపాలని అనుకుంది. సదరు ఎమ్మెల్యే చాకచక్యంగా వ్యవహరించడంతో గల్ఫ్ ట్రావెల్ దందా గుట్టు రట్టయ్యింది.
అసలేం జరిగిందంటే?
తెలంగాణలోని వేముల నియోజక వర్గ ఎమ్మెల్యే అది శ్రీనివాస్.. గల్ఫ్ ట్రావెల్ దందాను బయటపెట్టారు. ఫోన్ కాల్ తో అమాయకపు యువకులను మోసం చేస్తున్న వారిని కటకటాలపాలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సారంగాపూర్ మండలం రంగపేట గ్రామానికి చెందిన నవీన్.. ఓ యువతిని ఉద్యోగిగా పెట్టుకుని జిల్లా కేంద్రంలోని జంబిగద్దె ప్రాంతాల్లో అనుమతి లేకుండా లక్ష్మీ గల్ఫ్ ట్రావెల్స్ (Lakshmi Gulf Travels) నిర్వహిస్తున్నాడు. ఆమె ద్వారా అమాయక ప్రజలకు ఫోన్లు చేసి విదేశాలకు పంపిస్థానని డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడున్నాడు.
ఎమ్మెల్యేకి ఫోన్ చేసి గల్ఫ్ కు వెళ్తావా పంపిస్తాం..! అంటూ బేరాలు..!
గల్ఫ్ ఉద్యోగాల పేరుతో జగిత్యాల జిల్లాలో మోసాలు. ఏకంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కే ఫోన్ చేసిన ఏజెన్సీ నిర్వాహకులు.
పోలీసుల విచారణలో బయటపడ్డ ఏజెన్సీ దందా. జగిత్యాలలో గల్ఫ్ ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వహిస్తున్న… pic.twitter.com/3KIeKmDrN4— ChotaNews App (@ChotaNewsApp) May 5, 2025
ఎమ్మెల్యేకు ఫోన్ కాల్!
సాధారణంగా అమాయకులు చేస్తున్నట్లు సదరు యువతీ.. వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ కు ఫోన్ చేసింది. గల్ఫ్ పంపిస్తానని నమ్మబలికింది. ఎమ్మెల్యే తనకెందుకు ఫోన్ చేశావని అడగ్గా ఆ యువతి ఎమ్మెల్యే పైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎమ్మెల్యే.. ఎలాగైన ఈ ఏజెన్సీ గుట్టు రట్టు చేయాలని సంకల్పించారు.
Also Read: DMK MP: డీఎంకే ఎంపీకి తప్పిన పెను ముప్పు.. నెట్టింట వీడియో వైరల్
ఎస్పీకి ఫిర్యాదు
గల్ఫ్ ఉద్యోగం పేరిట తనకొచ్చిన ఫోన్ కాల్ గురించి నేరుగా జిల్లా ఎస్పీని కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వివరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆదివారం రాత్రి ట్రావెల్ ఏజెన్సీ ఆఫీసుపై దాడి చేశారు. కార్యాలయంలోని రికార్డులన్నీ పరిశీలించారు. అయితే సదరు ట్రావెల్స్ కు ఎలాంటి అనుమతి లేదని గుర్తించారు. దీంతో నిర్వహకుడు నవీన్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.