Miss World 2025 ( Image credit: Al )
తెలంగాణ

Miss World 2025: ప్రపంచ సుందరులు వచ్చారు.. ప్రజలకు మాత్రం ఎల్ఈడీ స్క్రీన్‌ పరిమితం?

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణలో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. నాలుగు రెండ్రోజుల్లో పోటీలు ప్రారంభం కానున్నాయి. అయితే అందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులంతా గోప్యత పాటిస్తున్నారు. ఏ అధికారి ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏ యే ప్రాంతాల్లో ఏర్పాట్ల బాధ్యతలను ఎవరికి అప్పగించారనేది కూడా అధికారులు బయటకు చెప్పడం లేదు.

తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను విశ్వవ్యాప్తం చేస్తామని చెబుతున్నప్పటికీ మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై ప్రచారం కరువైంది. అధికారులు పర్యటించామనో? లేకుంటే మీడియా ప్రకటన రిలీజ్ చేస్తే తప్ప సమాచారం తెలియడం లేదు. కంటెస్టెంట్స్ 22 ప్రాంతాల్లో పర్యటిస్తారని అందుకు ప్రాంతాలను సైతం ఎంపిక చేశారు. కానీ అక్కడ స్థానికులకు అనుమతి ఇవ్వరని కేవలం ఎల్ఈడీ స్క్రీన్లతో చూసే అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారులే క్లారిటీ ఇవ్వాలి.

 Also Rwead: TG Rythu Mungitlo: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. రంగంలోకి 200 బృందాలు.. ఇక దిగుబడే దిగుబడి!

రాష్ట్రంలో ఈ నెల 7 నుంచి 31వ తేదీవరకు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నారు. 120 దేశాలకు చెందిన పోటీదారులు హాజరవుతున్నారు. వారితో పాటు ప్రముఖులు, మీడియా ప్రతినిధులు సైతం రానున్నారు. 150దేశాల్లో అందాల పోటీలపై ప్రచారం నిర్వహించనున్నారు. అయితే అందాల పోటీలకు ఏయే ఏర్పాట్లు చేస్తున్నారు. అతిధులకు కల్పిస్తున్న సౌకర్యాల వివరాలను సైతం అధికారులు వెళ్లడించడం లేదు. కేవలం ఆయా ప్రాంతాలకు వెళ్తున్నట్లు మీడియాకు సైతం సమాచారం కరువైంది.

కేవలం వారు ఆయా ప్రాంతాలను పర్యటించిన తర్వాత మీడియాకు ప్రకటనను రిలీజ్ చేసి మమ అనిపిస్తున్నారు. అంటే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అందాల పోటీలపై ఎందుకు గోప్యత పాటిస్తున్నారు? భద్రత కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇతర కారణాలు ఉన్నాయి? అధికారుల మధ్య సమన్వయం లోపమా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గామారింది. ఎందుకు మీడియా ప్రచారం చేయలేకపోతున్నారు.. అసలు ప్రచారమే అవసరం లేదా? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చజరుగుతుంది.

Also Read: Minister Punnam Prabhakar: ములుగు ప్రజల దశాబ్దాల కల నెరవేరింది.. మంత్రి పొన్నం ప్రభాకర్!

మరో నాలుగు రోజులే..
అందాల పోటీల ప్రారంభానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 10 నుంచి పోటీ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. అయినప్పటికీ పోటీలపై ప్రచారం చేయడం లేదనిఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో పోటీల్లో భాగంగా22 ప్రాంతాలను పోటీదారులు సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నారు. నాగార్జున సాగర్ బుద్ధవనం, చార్మినార్​, చౌమెహల్లా ప్యాలెస్, వరంగల్ నగరంలోని వెయ్యి స్తంభాల గుడి, రామప్ప ఆలయం, యాదగిరి గుట్ట టెంపుల్, పోచంపల్లి, పిల్లలమర్రి, శిల్పారామం, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌, సచివాలయం, ఎక్స్​పీరియం ఎకో పార్కు, ఉప్పల్​ జరిగే ఐపీఎల్​ మ్యాచ్​ కు కూడా పోటీదారులు హాజరయ్యేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

అయితే ఏ అధికారికి ఏ బాధ్యతలు అప్పగించారనిది ఇప్పటికి అధికారుల్లోనే స్పష్టత కరువైందనే ప్రచారం జరుగుతుంది. అందుకే వివరాలను వెల్లడించడంలేదని, మీడియా ప్రచారం సైతం చేయకపోవడానికి ప్రాధాన కారణమని సమాచారం. ఎవరికి ఏయే బాధ్యతలు అప్పగించారో తెలియనప్పుడు ఎలా ప్రపంచ సుందరి పోటీలను విజయవంతం చేస్తారనేది విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఇమేజ్ ను ఎలా విశ్వవ్యాప్తం చేస్తారు.. టూరిజం హబ్ గా ఎలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారనేది ప్రశ్నార్ధకంగా మారింది.

 Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అలర్ట్!

ఎల్ఈడీ స్క్రీన్ లతో అందాల పోటీల ప్రసారం?
పహల్గంలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో దేశంలో ఉదృత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీల్లో 120 దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొంటుండటంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలుగ కూడదనే వారు పర్యటించే 22 టూరిస్టు ప్రాంతాల్లో స్థానికులకు దగ్గరివెళ్లి చూసే అవకాశం కల్పించరనే ప్రచారం జరుగుతుంది. అందెగత్తేలను స్థానికులు చూసేందుకు ఎల్ ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.

నిజంగానే అలా చేస్తున్నారా? స్థానికులు దగ్గరకు వెళ్లే అవకాశం ఉండదా? అనే అంశంపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రపంచ సుందరిపోటీలపై పోటీలు నిర్వహిస్తున్న ఆయా ప్రాంతాల్లోనూ మీడియా ప్రచారం చేయడం లేదని పలువురు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం లిమిటెడ్ గా 3వేల పాసులను మాత్రమే ఇస్తుందని సమాచారం. అలా ఇస్తే ప్రభుత్వానికి అనుకున్నంత మైలేజ్ రాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కొరవడిన సమన్వయం?
పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారుల మధ్య సమన్వయం లోపించిందనేది స్పష్టమవుతోంది. మిస్‌వరల్డ్‌ సంస్థ ఏర్పాట్ల బాధ్యతలను ఎవరికి అప్పగించింది.. వారు ఏం చేస్తున్నారు.. ఆ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తున్నారా? ఏర్పాట్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారా? తెలియజేస్తే ఎందుకు ప్రచారంలో వెనుకబడ్డారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోటీలు వారం..పదిహేను రోజుల క్రితమే తీసుకున్న నిర్ణయం కాదు.. రెండుమూడునెలల ప్లాన్ ఉంటుంది.

అయినప్పటికీ ఆశించిన మేరకు పోటీలపై ప్రచారం చేయడం లేదని విమర్శలు తలెత్తుతున్నాయి. టూరిజంకు చెందిన అధికారులకు బాధ్యతలు అప్పగిస్తే వారు ఏమైనా జాప్యం చేస్తున్నారా? అనేది హాట్ టాపిక్ గా మారింది. టూరిజంకు చెందిన అధికారులు సైతం పోటీలపై ప్రచారం చేయడంలో వెనుకబడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. సమాచారంకోసం ఫోన్లు చేసినా కొందరు అధికారులు లిప్టు చేయడంలేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read; ASRB 2025 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అగ్రికల్చర్ సైంటిస్ట్స్ జాబ్స్.. అప్లై చేసుకోండి

రేపు ఈవెంట్ ఆర్గనైజర్ల మీడియా సమావేశం
అందాల పోటీలపై ఇప్పటికే సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. మళ్లీ సీఎం రేవంత్​ రెడ్డి మిస్​ వరల్డ్​ పోటీలపై అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించనున్నట్లు తెలిసింది. అందాల పోటీల ఏర్పాట్లు, వివిధ దేశాల నుంచి వారికి బస, భద్రతా ఏర్పాట్లుపై ప్రత్యేక సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. మంగళవారం మిస్​ వరల్డ్​ఈవెంట్​ఆర్గనైజర్లు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పోటీలకు సంబంధించి పూర్తి క్లారిటీ వస్తుందని టూరిజం అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఏం చెబుతారు.. ఎలా మీడియా ప్రచారం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

హైదరాబాద్కు తరలివస్తున్న అందగత్తెలు
మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల పోటీదారులు హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ నెల 6 నుంచి వస్తారని భావించినప్పటికీ మూడు రోజుల ముందు నుంచి పోటీదారులు తరలివస్తున్నారు. మిస్ వరల్డ్ బ్రెజిల్ జెస్సికా స్కాండుజ్ పెద్రోసో, మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్ జాన్సెన్ వాన్ రెన్స్‌బర్గ్‌, రావడంతో ప్రభుత్వం తరఫున అధికారుల బృందం సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. మిస్‌వరల్డ్‌ సంస్థ సీఈవో, చైర్‌పర్సన్‌ మిస్‌ జూలియా ఎవెలిన్‌ మోర్లీ, మిస్‌ వరల్డ్‌ ప్రతినిధి మిస్‌ కెర్రి, మిస్ కెనడా మిస్ ఎమ్మా డీనా కాథరిన్ మోరిసన్ హైదరాబాద్​ కు చేరుకున్నారు. వారిని ఆతిథ్యం ఇచ్చే హోటల్‌కు తీసుకెళ్లి వారికి సౌలతులు కల్పించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?