Janulyri Divorce: డ్యాన్సర్ జాను లిరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో ఎన్నో ఫోక్ సాంగ్స్ చేస్తూ చాలా పాపులర్ అయింది. తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. అదే పాపులారిటీతో ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ఢీ డాన్స్ షోలో ఎంట్రీ ఇచ్చిన జాను.. తన డాన్స్ తో ఆ సీజన్ విన్నర్ గా నిలిచింది. దీంతో, జాను గురించి ఏ చిన్న వార్త తెలిసిన వెంటనే వైరల్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఈమె ఏడ్చుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేసి మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రస్తుత, ఇది వైరల్ గా మారడంతో జాను మొదటి భర్తకి షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Allu Arjun: కొత్త లుక్ లో అల్లు అర్జున్ .. ఈ సారి థియేటర్లు తగలపడిపోతాయి.. ఇది మాత్రం పక్కా
ఈమె అసలు పేరు ఝాన్సీ. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే మక్కువ. ఆమె తన ఐదవ తరగతి నుంచే డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టి, మూడేళ్లకే స్టెప్పులు వేస్తూ మెళుకువలు నేర్చుకుంది. చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటూ ఈ నేపథ్యంలోనే ఆట, ఢీ ప్రోగ్రామ్స్ లో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా చేస్తూ కుటుంబానికి అండగా నిలిచింది. అయితే, ఈ షో ల్లో అబ్బాయిలు, అమ్మాయిలను పైకి ఎత్తి తిప్పడం లాంటివి చూసిన జాను ఊరి జనాలు ఆమె తండ్రిని తిట్టడం మొదలు పెట్టారు. ఇక చేసేదేమి లేక బయట షోలకు పంపించడం మానేశారు.
Also Read: Sunitha – Pravasthi: సింగర్ ప్రవస్తి, సునీత గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన తమ్మారెడ్డి భరద్వాజ్
విడాకులు అందుకే ఇచ్చిందా?
టోనీ గురించి జాను ముందు పదే పదే మాట్లాడుతుంటే అతనిపై ఇంట్రెస్ట్ కలిగి కలవాలని అనుకుంది. ఆరోగ్యం బాగలేక సొంతూరు వెళ్ళిన టోనీని చూడగానే జాను ప్రేమలో పడింది. అప్పుడే తన నెంబర్ తీసుకుని, అప్పటి నుంచి తరచూ ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళు. ఈవెంట్స్ లో ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తుండటంతో పరిచయం ప్రేమగా మారింది. అప్పటికే జాను తండ్రి ఈమెకి పెళ్లి చేయాలని సంబంధాలు చూడటంతో ప్రేమని వదులుకోలేక ఇంట్లోనుంచి పారిపోయి 2013 లో టోనీని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఇద్దరూ హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యారు.
పెళ్ళైన ఏడాదికే 2014 లో ఒక బాబు జన్మనిచ్చింది. బాబు పుట్టాక ఆర్ధిక సమస్యలు ఎక్కువవ్వడంతో ఈవెంట్స్ చేస్తూ డబ్బు సంపాదించేది. మరో వైపు సినిమాల్లో కొరియోగ్రాఫర్ అవ్వాలనే టోనీ అవకాశాల కోసం చూశాడు. మూడేళ్లు అయిన ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. దీంతో, భార్య భర్తలకి మనస్పర్థలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అంతే కాదు, ఒక స్టేజ్ లో కొట్టుకునే వరకు వెళ్ళడంతో తనకి వేరే దారి లేక జాను తన భర్త నుంచి విడిపోవాలనుకుంది. 2018 లో అందరి సమక్షంలో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు.