Paresh Rawal and Actress Anu Aggarwal
ఎంటర్‌టైన్మెంట్

Heroine: పరేష్ రావలే కాదు.. ఈ హీరోయిన్ ‌కూడా సొంత యూరిన్ సేవించిందట!

Heroine: యూరిన్ ఏంటి? హీరోయిన్ సేవించడం ఏంటి? అని అనుకుంటున్నారా? నిజమే ఈ విషయం స్వయంగా ఆ హీరోయినే ఇటీవల చెప్పింది. అంతేకాదు, అది యోగాలో ఒక పార్ట్ అని కూడా ఆమె చెప్పడం విశేషం. అంతేనా, ఈ విషయంలో ఆమె సైన్స్‌ని కూడా తప్పుబడుతుంది. ఈ హీరోయిన్ కంటే ముందు, ఇలా సొంతం మూత్రం సేవించానని బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ సైతం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పరేష్ రావల్ అంటే బాలీవుడ్‌కే కాదు, టాలీవుడ్‌కి కూడా బాగా తెలిసిన నటుడు. శంకర్ దాదా ఎమ్‌బిబిఎస్ సినిమాలో ‘లింగ మాయ్య’ పాత్రలో కనిపించిన పరేష్ రావల్ (Paresh Rawal).. పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటించారు. అంతకుముందు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన కొన్ని సినిమాలలో కూడా పరేష్ రావల్ నటించారు. అలాంటి నటుడు తన సొంత యూరిన్ తాగానంటూ (Urine Drinking) చేసిన వ్యాఖ్యలు అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి.

Also Read- JVAS: రూ. 6-50 టికెట్ బ్లాక్‌లో రూ. 210.. ఇది చిరంజీవి స్టామినా!

ఇంతకీ పరేష్ రావల్ ఏం చెప్పారంటే.. ఒకసారి నా మోకాలికి గాయమైంది. ఎంతకూ తగ్గకు పోవడంతో ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాను. అప్పుడు నా దగ్గరకు వీరూ దేవగన్ (బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవగన్ తండ్రి) వచ్చారు. నన్ను పరామర్శించేందుకు వచ్చిన వీరూ దేవగన్.. అప్పుడు నాకొక మాట చెప్పాడు. ఇలాంటి గాయాలు త్వరగా మానాలంటే, రోజూ ఉదయాన్నే ఎవరి యూరిన్ వారు సేవించాలని చెప్పారు. నేను దాదాపు అలా 15 రోజుల పాటు చేశాను. మూత్రాన్ని ఒకేసారి గొంతులో పోసుకోకుండా.. బీర్‌లా నెమ్మదిగా సిప్ చేసే వాడిని. ఆయన చెప్పినట్లుగా నిజంగానే నా గాయం విషయంలో తేడా కనిపించింది.. అని పరేష్ రావల్ చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆయన చెప్పిన ఈ మాటలు పెద్ద కాంట్రవర్సీ కూడా అయ్యాయి.

ఇప్పుడు పరేష్ రావల్ బాటలోనే బాలీవుడ్‌కు చెందిన హీరోయిన్.. సేమ్ టు సేమ్ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం సంచలనంగా మారింది. పరేష్ రావల్ మాటలను సమర్థిస్తూ, నేను నా సొంత యూరిన్ సేవిస్తానని చెప్పిన హీరోయిన్ ఎవరో కాదు? ‘ఆషికి, ద క్లౌడ్ డోర్’, తిరుద తిరుద’ వంటి చిత్రాలలో నటించిన అను అగర్వాల్ (Anu Aggarwal). అవును, అను అగర్వాల్ తన తాజా ఇంటర్వ్యూలో తను కూడా యూరిన్ సేవించినట్లుగా చెప్పుకొచ్చింది. ‘యూరిన్ తాగడమనేది యోగాలో ఒక ముద్ర అని పేర్కొంది. ఇలా చేయడాన్ని ఆమ్రోలి అని పిలుస్తారని కూడా ఆమె తెలిపింది. దీనిని ఆమె పాటించారట. గ్లాస్ లకు గ్లాస్‌ల యూరిన్ తాగాల్సిన అవసరం లేదు. కొంచెం తీసుకుంటే చాలు. ఇలా తీసుకోవడం వల్ల యాంటీ ఏజింగ్ అంటే.. చర్మం మీద ముడతలు పోయి, వయసు తెలియనీయకుండా యవ్వనంగా కనిపిస్తారని అను అగర్వాల్ చెప్పుకొచ్చింది.

Also Read- Producer: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి!

ఇది సైన్స్‌లో ఎక్కడా చెప్పలేదు కదా అంటే, ‘‘మీరు సైన్స్‌ని నమ్ముతారు. నేను యోగాని నమ్ముతాను. సైన్స్ మహా అయితే 200 ఏళ్ల నుంచి ఉంది. కానీ యోగా, దాదాపు 1000 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఈ రెండింటిలో ఏది నమ్మాలో మీ ఇష్టం’’ అని అను అగర్వాల్ కుండబద్దలు కొట్టేసింది. ఇప్పుడామె చెప్పిన ఈ మాటలపై బాలీవుడ్‌లో, అలాగే సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. కొందరు ఆమె మాటలను సమర్ధిస్తుంటే, మరికొందరు ఎక్కడి నుంచి వస్తారో ఇలాంటోళ్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అది అసలు విషయం.

Anu Aggarwal
Anu Aggarwal

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి అడుగు పెట్టిన మొత్తం కంటెస్టెంట్స్ వీరే..

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. 11,12,13,14వ కంటెస్టెంట్స్‌గా ఎవరంటే! ట్విస్ట్ 15 కూడా!

TS BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి కొత్త ఇబ్బంది?. ఏ విషయంలో అంటే!

Heavy Rain In Warangal: వరంగల్ నగరంలో దంచికొట్టిన వర్షం.. పలుచోట్ల వరదలు

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్, సంజన!