Thammudu Release Date Announcement
ఎంటర్‌టైన్మెంట్

Thammudu: నితిన్ ‘తమ్ముడు’ రిలీజ్ డేట్ ఫిక్స్.. భలే ప్రకటించారుగా!

Thammudu: నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ (Robinhood) చిత్రం ప్రేక్షకులను బాగా నిరాశకు గురి చేసింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, విడుదలైన మొదటి ఆటకే నెగిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు. ఆఖరికి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ని తీసుకొచ్చినా కూడా, ఆ సినిమాకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. మొత్తంగా మరో పరాజయం నితిన్ (Nithiin) అకౌంట్‌లో పడింది. ఇప్పుడు అర్జెంట్‌గా నితిన్‌కి హిట్ కావాలి. లేదంటే, అతని కెరీర్ కష్టాల్లో పడే అవకాశం లేకపోలేదు. అందుకే ఇప్పుడు నితిన్ హోప్స్ అన్నీ ‘వకీల్ సాబ్’ దర్శకుడు శ్రీరామ్ వేణు చేస్తున్న ‘తమ్ముడు’ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడితేనే.. నితిన్ ఇండస్ట్రీలో నిలబడతాడు. లేదంటే, నితిన్ కెరీర్ డౌట్స్‌లో పడిపోతుంది.

Also Read- Producer: ఇండస్ట్రీలో విషాదం.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి!

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు (Sriram Venu) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తమ్ముడు’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలను పోషిస్తున్నారు. దర్శకుడు శ్రీరామ్ వేణు పుట్టిన రోజు స్పెషల్‌గా ఆదివారం (మే 4) ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ వినూత్నంగా ప్రకటించారు. ‘తమ్ముడు’ సినిమా జూలై 4న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఈ విషయం తెలిపేందుకు విడుదల చేసిన ఓ స్పెషల్ వీడియో క్రియేటివ్‌గా, ఎంటర్ టైనింగ్‌గా ఉండి, అందరినీ ఆకట్టుకుంటోంది.

‘తమ్ముడు’ విడుదల తేదీని ప్రకటించడానికి క్రియేట్ చేసిన వీడియోను గమనిస్తే.. ఈ చిత్రంలో నటించిన వివిధ భాషలకు చెందిన యాక్టర్స్ స్వసిక విజయన్, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, లయ, బేబి శ్రీరామ్ దీత్య ఒక్కొక్కరుగా డైరెక్టర్ శ్రీరామ్ వేణు దగ్గరకు వస్తారు. వీళ్లు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారని శ్రీరామ్ వేణు అనుకోగా.. వాళ్లు మాత్రం ‘తమ్ముడు’ సినిమా రిలీజ్ ఎప్పుడు? ప్రమోషన్ ఎప్పుడు బిగిన్ చేస్తారు? అని అడుగుతూ, అస్సలు శ్రీరామ్ వేణు బర్త్ డే గురించే తెలియదు అన్నట్లుగా బిహేవ్ చేస్తారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న లయ ఎంట్రీ ఇచ్చి.. ‘నేను ఈ సినిమాలో ఉన్నానా సార్. ఆన్ బోర్డ్ లేదు. ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు, రిలీజ్ డేట్ కూడా చెప్పడం లేదు’ అని ప్రశ్నిస్తుంది.

Also Read- Babil Khan: ఏడుస్తూ.. బాలీవుడ్‌పై ఇర్పాన్‌ ఖాన్‌ తనయుడు షాకింగ్ కామెంట్స్

చివరలో బేబి శ్రీరామ్ దీత్య కూడా ‘నేను థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మూవీ స్టార్ట్ చేశారు, ఇప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా, మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు?’ అని అడుగుతుంది. దీంతో డైరెక్టర్ శ్రీరామ్ వేణు వాళ్లకు ఏం చెప్పాలో తెలియక.. నీరసంగా ఫేస్ పెట్టి, ఇన్ఫామ్ చేస్తానని చెప్పి వాళ్లని పంపిస్తారు. చివరలో ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ వచ్చి.. శ్రీరామ్ వేణు బర్త్ డే కేక్ కట్ చేయడంతో పాటు జూలై 4న ‘తమ్ముడు’ మూవీ రిలీజ్ అంటూ ప్రకటించారు. మంచి ఫన్‌తో డిజైన్ చేసిన ఈ వీడియో క్రియేటివ్‌గా ఉండటమే కాకుండా, అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌లో నితిన్ ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ వంటి సినిమాలు చేస్తే, దర్శకుడు శ్రీరామ్ వేణు.. నాని హీరోగా ‘ఎంసీఏ’, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘వకీల్ సాబ్’ వంటి సినిమాలను రూపొందించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు